తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చి.. జాతీయ రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో కొన్ని విపక్ష పార్టీలతో ఐక్యతను మెయింటెన్ చేస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్‌తో మాత్రం అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేందుకు కేసీఆర్ వ్యుహాలు పక్కాగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతుంటాయి. అయితే తాజగా కేసీఆర్‌కు సంబంధించి సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్‌దేశాయ్‌ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

రాజ్‌దీప్ తన వీక్లీ బాగ్‌లో మోదీ వర్సెస్ ఆల్ అనే అంశం గురించి మాట్లాడారు. అందులో ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై మాట్లాడిన రాజ్‌దీప్.. 2024 ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీకి అన్ని ప్రతిపక్ష పార్టీలకు మధ్య జరుగుతాయా? అనేది చూడాల్సి ఉందన్నారు. ఈ ప్రశ్నకు తన పాయింట్ ఆఫ్ వ్యూలో 10 ఫ్యాక్టర్స్ సమాధానం చెబుతాయని పేర్కొన్నారు. 

ఈ క్రమంలోనే.. ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తుందా? లేదా? అనేది ప్రశ్నగా మిగిలిందన్నారు. లోక్‌సభలో అనర్హత వేటు పడిన రాహుల్ ‌గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్వహించిన విందుకు 19 ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయని చెప్పారు. అందులో టీఎంసీ, టీఆర్ఎస్‌లు కూడా ఉన్నాయని అన్నారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉందని.. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్న లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ అలియన్స్‌లో ఉందని గుర్తుచేశారు. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షాల ఐక్యత ఏ మేరకు సాధ్యపడుతుందో చూడాల్సి ఉందన్నారు. 

Scroll to load tweet…

‘‘ప్రాంతీయ పార్టీల నాయకుల ఈగోల గురించి ప్రస్తావించిన రాజ్‌దీప్.. ప్రతి నేత కూడా తమను తాము జాతీయ నేతగానే భావిస్తున్నారు’’ అని రాజ్‌దీప్ అన్నారు. ‘‘కేసీఆర్‌ను తీసుకుంటే.. ఆయన తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కోసం ప్రచారం మొదలుపెట్టారు. ప్రైవేట్ కన్వరేజషన్‌లో కేసీఆర్.. తన సహచరులతో ప్రతిపక్షాల కూటమికి తనను చైర్ పర్సన్‌ను చేస్తే. 2024 ఎన్నికల మొత్తం ఖర్చు భరించడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు. అయితే ఇందుకు ప్రతిపక్షాలలో కేసీఆర్‌కు సమకాలీకంగా ఉన్న నాయకులు అంగీకరిస్తారా?’’ అని రాజ్‌దీప్ పేర్కొన్నారు. ఇంకా ప్రతిపక్షాల కూటమి ఉంటుందా? అనే దానికి సంబంధించి వివిధ అంశాలను ఆ వీడియోలో రాజ్‌దీప్ ప్రస్తావించారు.