raja singh: గంగుల.. నీ ఓటమి ఖాయమైంది.. తప్పు కుంటే మంచిది - కరీంనగర్ లో రాజాసింగ్..

raja singh : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ను అసెంబ్లీకి పంపించాలని కరీంనగర్ ప్రజలను ఆ పార్టీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. మంత్రి గంగుల కమలాకర్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

raja singh : Gangula.. your defeat is certain.. it is better to be wrong - Rajasingh in Karimnagar..ISR

raja singh : బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కరీంగనర్ లో హల్ చల్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నేడు కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం కోసం రాజాసింగ్ కరీంగనర్ వచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి వేలాది మంది యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన ప్రసగించారు. స్థానిక మంత్రి గంగుల కమలాకర్ పై విమర్శలు గుప్పించారు. ధర్మం కోసం, ప్రజల కోసం ప్రతీ రోజూ పోరాటం చేస్తున్న బండి సంజయ్ పక్షాన ఉంటారా? అవినీతి, అక్రమాలతో వేల కోట్లు సంపాదించిన బీఆర్ఎస్ అభ్యర్ధి పక్షాన ఉంటారా? అని అన్నారు. 

annaram barrage : ఖాళీ అవుతున్న అన్నారం బ్యారేజీ.. 10 రోజులుగా గేట్లు ఎత్తి నీటి విడుదల

బండి సంజయ్ (bandi sanjay)  ఓ వ్యక్తి కాదని, ఓ శక్తి అని రాజాసింగ్ కొనియాడారు. ఆ శక్తితో దున్నపోతులు పోటీ పడలేవని అన్నారు. కరీంనగర్ లో పెద్దన్న బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి  రావడం ఆనందంగా ఉందని చెప్పారు. కరీంగనర్ నుంచి బండి సంజయ్ ను పార్లమెంట్ కు పంపారని, ఇప్పుడు అసెంబ్లీకి కూడా పంపుతారని ఆశిస్తున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ ను గద్దె దించేందుకు బండి సంజయ్ కంకణం కట్టుకున్నారని, ఇప్పటి వరకు 1500 కిలో మీటర్లు పాదయాత్ర చేశారని తెలిపారు.

మహిళా ఆఫీసర్ హత్య కేసులో డ్రైవర్ అరెస్టు.. ఉద్యోగంలో నుంచి తొలగించందుకే దారుణం ?

ఈ సందర్భంగా రాజాసింగ్.. గంగుల కమలాకర్ పై విరుచుకుపడ్డారు. ‘‘ ఇక్కడి ఎమ్మెల్యేకు ఏది చేతగాదు. బండి సంజయన్న పోటీ చేస్తున్నడని తెలియగానే దారుస్సలాం పోయి సలాం చేసిండు. గంగుల కమలాకర్. మీ ఓటమి ఖాయమైంది. ఈ నియోజకవర్గం నుండి తప్పుకుంటే మీకే మంచిది. బండి సంజయ్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు.’’ అని అన్నారు. గంగుల అవినీతికి అంతులేకుండా పోయిందని ఆరోపించారు. గుడి, బడి, గ్రానైట్ సహా ఎందులో చూసినా అవినీతే కనిపిస్తోందని చెప్పారు. 

కీచక ప్రిన్సిపాల్.. 50 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు..

ఓటుకు రూ.20 వేలు ఇచ్చేందుకు గంగుల కమలాకర్ సిద్దమయ్యారని రాజాసింగ్ విమర్శించారు. ఆ డబ్బుతో ఐదు సంవత్సరాలు బతకలేరని అన్నారు. ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ (asaduddin owaisi)పై విరుచుకుపడ్డారు. కరీంనగర్ లో ఎంఐఎం అభ్యర్ధిని పోటీ చేయించే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇక్కడే అభ్యర్థిని నిలిపే ధైర్యం లేక వేరే వ్యక్తికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. ముస్లిం మహిళల కోసం బీజేపీ ట్రిపుల్ తలాఖ్ రద్దు చట్టం చేసిందని గుర్తు చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios