ఒక వైపు ఎండలు.. మరో వైపు వానలు. స్థూలంగా మన రాష్ట్రంలో ఇదీ వాతావరణ పరిస్థితి. ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ ఉరుములు మెరుపులతో వర్షాలు, వడగండ్లు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మిగితా ఏరియాల్లో ఎండలు దంచి కొడతాయని వివరించింది. 

హైదరాబాద్: ఒక వైపు భానుడి ప్రతాపంలో ఎండలు భగభగ మండిపోతుంటే.. మరో వైపు ఆకస్మిక వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ తెలంగాణలోని ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు, వర్షాలే కాదు.. కొన్ని చోట్ల వడగండ్ల వానలూ కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

మహారాష్ట్రలోని తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకు ద్రోభి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులు బలంగా వీస్తాయని, వర్షాలు కూడా కురుస్తాయని వివరించింది. కొన్ని చోట్ల వడగండ్ల వానలూ కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. 

అందుకే తెలంగాణలోని సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌గర్ జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మన రాష్ట్రంలోని ఈ ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. ఈదురుగాలులు కూడా బలంగా వీచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. కొన్ని చోట్ల వడగండ్లు కూడా కురుస్తాయని తెలిపింది. 

Also Read: అంతా కుమ్మక్కై రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌లో చీటింగ్! ఐదు నిమిషాల్లో 40 ప్రశ్నలకు సమాధానాలు.. ఐదుగురు అరెస్టు

కాగా, మిగితా ప్రాంతాల్లో మటుకు ఎప్పటిలాగే ఎండలు మండిపోతాయని వివరించింది. ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదు కావొచ్చని తెలిపింది. కాగా, హైదరాబాద్‌లో ఎండల తీవ్రత స్వల్పంగా ఉంటుందని వివరించింది. అలాగే, వర్ష కురిసే అవకాశాలూ ఇక్కడ ఉన్నాయని పేర్కొంది.