తెలంగాణా పక్కదారి పట్టేందనేందుకు రాహుల్ ముఖ్యమంత్రి నిర్మించుకున్న విలాసవంతమయిన అధికార నివాసాన్ని ఉదహరించారు.  ‘350 కోట్ల తో సీఎం నివాసం కట్టుకున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి  ఇంత ఖరీదయిన విలాసవంతమయన బంగ్లా లేదు,’ అని రాహుల్ అన్నారు.  రైతులు సాగునీరు, యువత ఉద్యోగాలు వస్తాయను కున్నారు. ప్రజల ఆకాంక్షలను  అర్థం చేసుకునే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు. మీరు కన్నకలలు తెలంగాణలో నిజమవుతున్నాయా,’ అని ఆయన ప్రజలను అడిగారు.

 ప్రజల కలల తెలంగాణా పక్కదారి పట్టిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.

అధికారం చేజిక్కించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుటుంబం కలలు కన్న తెలంగాణా ఏర్పాటుచేసుకుంటున్నారని,ప్రజలను, రైతులను, విద్యార్థులను వదిలేశారని తీవ్రంగా విమర్శించారు.

కెసిఆర్ మూడేళ్ల పాలన మీద చార్జ్ షీట్ విడుదల చేసేందుకు సంగారెడ్డిలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రజాగర్జన (వీడియో) లో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు నీళ్ళు,నిధులు, నియమకాల పై హాక్కు రావాలని కలలు కన్నారు, అదినేరవేరకుండా తెలంగాణానుమరొకదారిలోకి , అవినీతి దారిలోకి మళ్లించారని ఆయన విమర్శించారు.

ప్రజల కలలకనుగుణంగా తెలంగాణా పునర్నిర్మించాలనే బృహత్తర కార్యక్రమం వదలేసి తెలంగాణా ప్రభుత్వం కుటుంబం కోసం, కాంట్రాకర్ల కోసం పనిచేసే ప్రభుత్వం అయిందని ఆయన విమర్శించారు.

తెలంగాణా పక్కదారి పట్టేందుకు ఆయన ముఖ్యమంత్రి నిర్మించుకున్న బంగళాను ఉదహరించారు.

 ‘350 కోట్ల తో సీఎం నివాసం కట్టుకున్నారు. .దేశం లో ఏ ముఖ్యమంత్రికి ఇంత ఖరీదయిన విలాసవంతమయన బంగ్లా లేదు,’ అని రాహుల్ అన్నారు. రైతులు సాగునీరు, యువత ఉద్యోగాలు వస్తాయను కున్నారు.ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు. .మీరు కలలు కన్న తెలంగాణలో నిజమవుతున్నాయా,’ అని ఆయన ప్రశ్నించారు.

సరైన మార్గం లో ప్రభుత్వం పనిచేస్తుందా అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అడిగారు.

తీరాచూస్తే, తెలంగాణ ప్రజలు ఒక్క కుటుంబం కోసమే ఉద్యమ చేశారా, కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ ఏర్పడిందా అనే అనుమానం కలుతుగూ ఉందని ఆయన ఆశ్చర్యపోయారు.

ఇతర పార్టీ ఎమ్మెల్యే లను గుంజుకోవడానికేనా ఏర్పడింది అని కూడా ఆయన ప్రశ్నించారు

కేవలం నలుగురి కోసం తెలంగాణా నా అని రాహుల్ అన్నారు.

ఇదేనా బంగారు తెలంగాణా..? అని అంటూ .కేసీఆర్ మూడేళ్లలో 2850 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన గుర్తుచేశారు.

రాహుల్ లెవనెత్తిన మరికొన్ని ప్రశ్నలు:

రుణ మాఫీ చేసినట్లే చేసి రైతులకు పాస్ బుక్ లు ఎందుకు తనఖా పెట్టుకున్నారు?

కొత్త రుణాలు ఎందుకు ఇవ్వడం లేదు?

.రైతులకు ప్రభుత్వం బేడీలు వేస్తుంది.

మిర్చి వేసుకోమన్న ముఖ్యమంత్రే వారి మద్దతు ధర ఎందుకు ఇవ్వలేదు?

సీఎం మాటలు నమ్మి మిర్చి వేసుకున్నందుకు... బేడీలు వేస్తారా..,?

ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న సీఎం.. ఉరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు..

కేసీఆర్ కాంగ్రెస్ ప్రాజెక్ట్ లకు పేర్లు మార్చితనవిగా చెప్పి మోసం చేస్తున్నాడు.

రైతుల భూమిని లాక్కోవాలని కేసీఆర్ చూస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలని అన్నారు.