తనపై సినీ నటి డింపుల్ హయాతి చేసిన వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే స్పందించారు. తాను ఎక్కడా తప్పు చేయలేదని.. నిజాలు నిలకడ మీద తెలుస్తాయని రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. 

తనపై సినీ నటి డింపుల్ హయాతి చేసిన వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే స్పందించారు. తాను , డింపుల్ జూబ్లీహిల్స్‌లో ఒకే ఆసుపత్రిలో వుంటున్నామని తెలిపింది. ఒక రోజున ఆమె తన కారుకు అడ్డంగా కారును పెట్టిందని రాహుల్ తెలిపారు. అదే సమయంలో అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి రావడంతో తానే వ్యక్తిగతంగా వెళ్లి కారును తీయాల్సిందిగా రిక్వెస్ట్ చేశానని ఆయన పేర్కొన్నారు. ఆమె దానికి అంగీకరించకపోగా.. కారుతో ఢీకొట్టి, కాళ్లతో తన వాహనాన్ని తన్నిందని రాహుల్ చెప్పారు. తన పట్ల డింపుల్ ప్రవర్తన అభ్యంతరకరమన్న ఆయన.. దీనిపై తన డ్రైవర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారని రాహుల్ హెగ్డే చెప్పారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి డింపుల్ చేసిన ట్వీట్ అభ్యంతరకరమన్నారు. తాను ఎక్కడా తప్పు చేయలేదని.. నిజాలు నిలకడ మీద తెలుస్తాయని రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. 

అంతకుముందు ఈ వ్యవహారంపై డింపుల్ హయాతి లాయర్ స్పందించారు. ట్రాఫిక్ నియంత్రణకు రోడ్డుపై ఉపయోగించే కోన్స్ అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్లేస్ లోకి ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని రెండు నెలలుగా అడుగుతున్నామన్నారు. డీసీపీ స్థాయి వ్యక్తికి అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కొన్ని రోజుల క్రితం డింపుల్ హయతితో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే అసభ్యంగా మాట్లాడారని లాయర్ ఆరోపించారు. 

ALso Read: తప్పుడు కేసు, కోర్టులోనే తేల్చుకుంటాం: డింపుల్ హయతి న్యాయవాది

రాహుల్ హెగ్డే తన డ్రైవర్ తో డింపుల్‌పై కేసు పెట్టించారన్నారు. అయితే డింపుల్ చేసిన ఫిర్యాదును మాత్రం పోలీసులు స్వీకరించలేదని లాయర్ తెలిపారు. నాలుగు గంటల పాటు డింపుల్ హయాతిని స్టేషన్‌లో కూర్చోబెట్టారని .. తాము కూడా లీగల్‌గానే ఫైట్ చేస్తున్నామని న్యాయవాది తెలిపారు. వేధించడం కోసమే డింపుల్ పై కేసు పెట్టారని ఆయన ఆరోపించారు.