శిల్పా చౌదరి కేసు : కేసులో ట్విస్ట్.. విచారణకు రాధికారెడ్డి డుమ్మా.. నోటీసులివ్వనున్న పోలీసులు..!
ఈ రోజు విచారణకు రావాల్సిన రాధికా రెడ్డి మొహం చాటేశారు. సోమవారం డాక్యుమెంట్లతో సహా వస్తానని చెప్పారు Radhika Reddy. శిల్పా చౌదరి మీద ఫిర్యాదు చేస్తానన్నారు. రాధికా రెడ్డి రాకపోవడంతో శిల్పా కేసులో రాధిక రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారు నార్సింగి పోలీసులు.
Shilpa Chowdary కేసులో నార్సింగి పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రెండు రోజుల Custodyలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కిట్టీ పార్టీలతో మొదలుపెట్టి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తమ స్థాయిని పెంచుకునేందుకు ఎవరైనా ఏం చేస్తారు? ఎవరైనా ఏమోగానీ శిల్పా చౌదరి మాత్రం ఇలా చేసింది.. శిల్ప సిత్రాల్లో భాగంగా బౌన్సర్ లను తెర పైకి తీసుకు వచ్చింది. అయితే ఈ రోజు విచారణకు రావాల్సిన రాధికా రెడ్డి మొహం చాటేశారు. సోమవారం డాక్యుమెంట్లతో సహా వస్తానని చెప్పారు Radhika Reddy. శిల్పా చౌదరి మీద ఫిర్యాదు చేస్తానన్నారు. రాధికా రెడ్డి రాకపోవడంతో శిల్పా కేసులో రాధిక రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారు నార్సింగి పోలీసులు.
శిల్పా చౌదరి cheatings ఆధారాలు గా తన దగ్గరున్న చెక్కులు వాట్సాప్ లో పోలీసులకు అందజేశారు.. కేసు పెట్టి తనకు న్యాయం చేయాలని కోరారు రాధికా రెడ్డి. శిల్పా చౌదరి బిల్డప్ కోసం.. స్టేటస్ సింబల్ గా.. బౌన్సర్లను నియమించుకున్నట్లు చెప్పారు శిల్ప. మరో కొత్త విషయం ఏమిటంటే ఆమె రెండేళ్లు అమెరికాలో ఉండి వచ్చిందట.
అమెరికా ఎందుకు వెళ్లారు? ఎవరెవరు వెళ్లారు? అక్కడ కూడా డిలీంగ్స్ చేశారా? అనే కోణంలో ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు. తన లైఫ్ స్టైల్ కు సంబంధించిన అన్ని విషయాలను చెబుతూ.. తనను రాధికా రెడ్డి అనే రియల్టర్ మోసం చేసిందనే విషయాన్ని కూడా పూసగుచ్చినట్లు చెప్తున్న శిల్పా చౌదరి... ఆర్థిక లావాదేవీలపై మాత్రం నోరు మెదపడం లేదు.
shilpa chowdary Case : రేపు విచారణకు హాజరుకానున్న ప్రముఖులు.. ఇప్పటికే నోటీసులు, ‘‘రాధిక’’పైనా ఆరా
తనని పోలీసులు అరెస్టు చేశాక మైండ్ బ్లాక్ అయ్యిందని.. జైలుకెళ్లాక మతిస్థిమితం బాగోలేదంటూ చెబుతున్నారామె. రోజుకో డ్రామా పూటకో మాటలో భాగమే ఈ డైలాగ్ కూడా అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. మహిళలతో జరిగిన కిట్టి పార్టీల ఃపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
శిల్పా చౌదరి కేసులో నార్సింగి పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.ఇప్పటికే రెండు రోజుల తీసుకుని పోలీసులు విచారించారు. కస్టడీ ముగియడంతో పోలీసులు తిరిగి జైలుకు పంపించారు. మిగతా కేసులో పోలీసులు కస్టడీకి కోరనున్నారు. ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో నార్సింగి పోలీస్ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఇదిలా ఉండగా, కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణ సందర్భంగా ఆమె శనివారం నాడు తనను రాధికారెడ్డి అనే యువతి మోసం చేసినట్లు శిల్ప పోలీసులకు తెలిపింది. ఆమె తన నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుందని శిల్ప వెల్లడించింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌తో పాటు పలు ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది శిల్ప. రాధికా రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తోందని పోలీసులకు తెలిపింది శిల్పా చౌదరి.