ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైన ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును రాచకొండ  పోలీసులు ఛేదించారు. మట్టారెడ్డే సూత్రధారని తేల్చిన పోలీసులు.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రెండు వెపన్స్, 20 రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు.

శ్రీనివాస్‌ రెడ్డి రెండు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో రాఘువేందర్ రెడ్డితో కలిసి పదెకరాల స్థలం కొన్నాడు. అయితే ఆ స్థలం తనదేనంటూ మట్టారెడ్డి దాన్ని కబ్జా చేశాడు. దీంతో మంగళవారం శ్రీనివాస్‌ రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి కలిసి స్థలం వద్దకు వెళ్లగా మట్టారెడ్డి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే మట్టారెడ్డి అనుచరులతో కలిసి వారిద్దరిపై కాల్పులకు దిగాడు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో (ibrahimpatnam shooting case) ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమీషనర్ (rachakonda police commissioner) మహేశ్ భగవత్ (mahesh bhagwat) వెల్లడించారు. మట్టారెడ్డి, ఖాజా మహముద్దీన్, భూరి భిక్షపతి, సయ్యద్ రెహ్మాన్ సమీర్ అలీ, రాజుఖాన్‌లను అరెస్ట్ చేశారు. అలాగే రెండు వెపన్స్, 20 రౌండ్స్ స్వాధీనం చేసుకున్నట్లు మహేశ్ భగవత్ పేర్కొన్నారు. 

రియల్ ఎస్టేట్ కాల్పుల ఘటనలో ఇద్దరు చనిపోయారని ఆయన తెలిపారు. లేక్ విల్లా ఆర్కిడ్స్ వెంచర్ వ్యవహారమే హత్యకు కారణంగా పోలీసులు నిర్ధారించారు. మొత్తం 14 ఎకరాల భూ వివాదం హత్యకు దారి తీసిందని సీపీ చెప్పారు. ప్రధాన నిందితుడు మట్టారెడ్డి అని మహేశ్ భగవత్ తెలిపారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు బీహార్‌కు చెందినవాళ్లేనని కమీషనర్ పేర్కొన్నారు. 

కాల్పుల్లో ఇద్దరు చనిపోవడంతో ప్రత్యేక కేసుగా భావించి ఛేదించామని మహేశ్ భగవత్ వెల్లడించారు. 48 గంటల పాటు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామని.. మత్తారెడ్డి, అశోక్‌రెడ్డి, ముజాహిద్దీన్‌, భిక్షపతి, షమీం, రహీమ్‌ను అరెస్టు చేశామని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించామని.. మట్టారెడ్డికి గతంలో నేర చరిత్ర ఉందని మహశ్ భగవత్ వెల్లడించారు. 

కాల్పుల ఘటనపై పథక రచన (matta reddy) మట్టారెడ్డిదేనని... తుపాకులు, మందు గుండు సామగ్రి కొనేందుకు నిందితులు బిహార్‌ వెళ్లారని చెప్పారు. స్థిరాస్తి వ్యాపారులపై భిక్షపతి, మొహినుద్దీన్‌ కాల్పులు జరిపారని.. తొలుత విచారణలో మట్టారెడ్డి తమకు సహకరించలేదని సీపీ తెలిపారు. అయితే అతని గెస్ట్‌ హౌస్‌ వద్ద సీసీ ఫుటేజీ లభించడంతో కేసు కీలక మలుపు తిరిగిందని మహేశ్‌ భగవత్‌ చెప్పారు. 

ఇకపోతే, హైదరాబాద్‌ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధి కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి.. అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్‌ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్‌ ఆస్పత్రిలో రాఘవేందర్ రెడ్డి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

కేసును ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. శ్రీనివాస్‌ రెడ్డి రెండు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో రాఘువేందర్ రెడ్డితో కలిసి పదెకరాల స్థలం కొన్నాడు. అయితే ఆ స్థలం తనదేనంటూ మట్టారెడ్డి దాన్ని కబ్జా చేశాడు. దీంతో మంగళవారం శ్రీనివాస్‌ రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి కలిసి స్థలం వద్దకు వెళ్లగా మట్టారెడ్డి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే మట్టారెడ్డి అనుచరులతో కలిసి వారిద్దరిపై కాల్పులకు దిగాడు.