పోలీసులు ముందుగానే స్పందించి ఉంటే... తమకూతురు తమకు దక్కి ఉండేదని ప్రియాంక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.... తమ కూతురు శవాన్ని చూసి ఆమె తండ్రి శ్రీధర్ రెడ్డి కన్నీరు మున్నీరుగా విలపించారు.  రాత్రి 11గంటల సమయంలోనే తాము తమ కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశామని.. వారు అప్పుడే స్పందించి దర్యాప్తు చేసి ఉంటే.. మా అమ్మాయి ఆచూకీ దొరికి ఉండేది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం ఉదయం శంషాబాద్ పోలీసులు తమను తొలుత తొండుపల్లి టోల్ గేట్ వద్దకు తీసుకువెళ్లారని.. ఆ తర్వాత షాద్ నగర్ సమీపంలోని ఘటనాస్థలికి తీసుకువెళ్లగా.. అక్కడ కాలిపోయిన స్థితిలో మృతదేహం ఉందని చెప్పారు. జీన్స్ ప్యాంటును బట్టి తమ కూతురేనని గుర్తు పట్టామన్నారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని.. నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

AlsoRead ప్రియాంక రెడ్డి స్కూటీ, లోదుస్తులు లభ్యం.... ఆ ఇద్దరిపైనే అనుమానం.....

కాగా... తమ కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని.. త్వరలోనే పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని అనుకున్నామని...  అంతలోనే ఇంత దారుణం జరిగిపోయిందని ఆ తండ్రి పెడుతున్న కన్నీరు చూసి స్థానికులు కూడా చెలించిపోయారు. గురువారం సాయంత్రం పాతనగరంలోని పూరానాపూల్ స్మశానవాటిలో ప్రియాంక రెడ్డి అంత్యక్రియలు ఆమె తండ్రి శ్రీధర్ రెడ్డి నిర్వహించారు. 

 ప్రియాంక ప్రయాణించిన స్కూటీని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా బస్టాండ్ వద్ద గుర్తించారు. దుండగులు స్కూటీ నెంబర్ ప్లేట్లను తొలగించి బస్టాండ్ దగ్గర వెదిలివెళ్లారు. 

AlsoRead లారీలను అడ్డం పెట్టి ప్రియాంకపై అత్యాచారం, హత్య..?: పోలీసుల వద్ద ఆధారాలు...

స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్కూటీ దొరికిన ప్రాంతాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రియాంకను హత్య చేసింది అనంతపూర్‌కు చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు‌గా అనుమానిస్తున్నారు. లారీ నెంబర్‌ను కూడా పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉండగా.. ప్రియాంకరెడ్డి హత్య జరిగిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. శంషాబాద్ టోల్‌గేట్ పక్కనున్న కాంపౌండ్ వద్ద ప్రియాంక ఇన్నర్‌వేర్‌తో పాటు చెప్పులను పోలీసులు గుర్తించారు. అలాగే వాటి పక్కనే మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

AlsoRead హాస్పిటల్ కి వెళ్లి మిస్సింగ్... ఉదయానికి శవంగా.. యువతి దారుణ హత్య...

దుండగులు ప్రియాంకపై లారీలను అడ్డంపెట్టుకుని అత్యాచారం చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్ వద్ద వున్న సీసీ కెమెరాల్లో లారీలు తిరిగిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఘటనాస్థలంలో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు డాగ్‌స్క్వాడ్ సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. 

కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాత్రి 9.45 గంటలకు ప్రియాంక తన సోదరితో ఫోన్‌లో మాట్లాడిందని.. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసినట్లు తాము అనుమానిస్తున్నామని.. అనంతరం ప్రియాంకపై అత్యాచారానికి పాల్పడి హతమార్చి ఉండవచ్చని డీసీపీ తెలిపారు. 

హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక రెడ్డి అనే యువతి బుధవారం ట్రీట్మెంట్ కోసం మాదాపూర్ లోని హాస్పిటల్ కి వెళ్లింది. మార్గ మధ్యంలో స్కూటీ పాడయ్యిందని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. తన స్కూటీ ఆగిపోయిన ప్రాంతంలో లారీ డ్రైవర్లు ఉన్నారంటూ ఫోన్ లో ప్రియాంక భయంగా చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.కాగా... ఆ తర్వాత కుటుంబసభ్యులు ఆమె ఫోన్ కి ప్రయత్నించినా కలవలేదు. తీరా చూస్తే... గురువారం ఉదయం శవమై కనిపించింది.