పీవీ తెలంగాణ ఠీవీ.. క్లిష్టసమయంలో దేశాన్ని కాపాడిన ముద్దుబిడ్డ: సీఎం కేసీఆర్‌

Hyderabad: భార‌త మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ‌ పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ఆయన సేవలను స్మరించుకున్నారు. పీవీ సేవలను, గొప్పతనాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. ''పీవీ తెలంగాణ ఠీవీ.. క్లిష్టసమయంలో దేశాన్ని కాపాడిన ముద్దుబిడ్డ'' అంటూ కేసీఆర్ కొనియాడారు.
 

PV Narasimha Rao birth anniversary: KCR, Modi, Kharge pay tributes to late PM RMA

PV Narasimha Rao on 102nd birth anniversary: భార‌త మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ‌ పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ఆయన సేవలను స్మరించుకున్నారు. పీవీ సేవలను, గొప్పతనాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. పీవీ తెలంగాణ ఠీవీ.. క్లిష్టసమయంలో దేశాన్ని కాపాడిన ముద్దుబిడ్డ అంటూ కేసీఆర్ కొనియాడారు.

వివ‌రాల్లోకెళ్తే.. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు తెలంగాణ మహానుభావుడు పీవీ నరసింహారావు అండగా నిలిచారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలను యావత్ దేశ ప్రజలు నేడు అనుభవిస్తున్నారని తెలిపారు. పీవీ న‌ర‌సింహారావు 102వ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ, గొప్ప రాజకీయ చతురతను, అరుదైన పాలనా నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా ఆధునిక భారతదేశాన్ని అగ్రదేశాల ముందు తనంతట తాను నిలబడేలా మాజీ ప్రధాని పీవీ పునాది వేశారని కేసీఆర్ కొనియాడారు.

పీవీ న‌ర‌సింహా రావు మ‌న దేశానికి అందించిన సేవలను గౌరవించడం మన బాధ్యత. ఆయన సేవలను, గొప్పతనాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. పీవీ నరసింహారావు తెలంగాణకు గర్వకారణం, ఆ మహానేత నుంచి స్ఫూర్తి పొంది రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న‌ద‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు సైతం నివాళులర్పించారు. 'పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాను. ఆయన దూరదృష్టి గల నాయకత్వం, భారతదేశ అభివృద్ధి పట్ల నిబద్ధత చెప్పుకోదగినవి. దేశ పురోగతికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను గౌరవిస్తున్నాం' అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

 

భారతదేశ ఆర్థిక పరివర్తనకు, దేశ నిర్మాణంలో దివంగత సీనియర్ నేత చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమని ఖర్గే ట్వీట్ చేశారు.

 

కాగా, 28 జూన్ 1921న తెలంగాణలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించిన పీవీ న‌ర‌సింహా రావు..  నెహ్రూ-గాంధీ కుటుంబం వెలుప‌ల 1991-1996 వరకు ఐదేళ్ల పాటు ప్రధానిగా పూర్తి కాలాన్ని పూర్తి చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఆయ‌న నాయ‌క‌త్వంలోని అప్పటి భారత ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారు. తన నిర్ణయాలను అమలు చేసే అధికారాన్ని సింగ్ కు కల్పించింది ఆయ‌నే. 23 డిసెంబర్ 2004న తన 81వ యేట కన్నుమూశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios