మహిళల్లో నెలసరిలో వచ్చే మార్పులపై అవగాహనా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ప్యూర్ సంస్థ ప్రతినిధి సంధ్య గొల్లమూడి వెల్లడించారు. ఏప్రిల్ 4వ తేదీన  ప్యూర్ ఫెమ్మే సాంగ్ అండ్ ఫిలింను, ప్యూర్ గురు, ప్యూర్ హ్యూమన్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభిస్తారని చెప్పారు. 

బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్యూర్ ఫెమ్మే రుతుస్రావం, పరిశుభ్రత అవగాహన ప్రచారం చేస్తుందని తెలిపారు. 

కౌమారదశలో ఉన్న బాలికల్లో రుతుస్రావం మీద తగినంత అవగాహన కల్పించడం, అపోహల్ని పోగొట్టడం మీద దృష్టి పెట్టడం, రుతుస్రావం అమ్మాయి విద్యపై ప్రభావితం చేయకుండా చూడడం ప్యూర్ ఫెమ్మే కార్యక్రమం యొక్క లక్ష్యం. 

దీనికి సంబంధించిన పరిశుభ్రత ఉత్పత్తుల్ని అందుబాటులోకి తీసుకురావడం, ఎలా వినియోగించాలో తెలియజేయడం, యుక్తవయసును అర్థం చేసుకోవడంలో వారికి యుక్తవయస్సును వారికి సహాయపడే ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించడం ప్యూర్ సంస్థ చేస్తుంది. 

రుతుస్రావం అంటే నిషేదించబడిన అంశంగా చూసే పరిస్థితిలో మార్పును తీసుకురావడానికి అమ్మాయిలతో పాటు, అబ్బాయిలు ఉపాధ్యాయులు సంభాషించుకునేలా సెషన్లు నిర్వహించడం. మెన్ స్ట్రువల్ హైజిన్ మీద ఎడ్యుకేట్ చేస్తుంది. 

బాలికలను సరైనా అవగాహన అందించడం ద్వారా వారిలో అపోహల్ని తొలగించి, రుతుస్రావం విషయంలో జాగ్రత్తగా ఉండేలా, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేలా సాయపడుతుంది. 

నెలసరి సమయంలో సరైనా ప్యాడ్స్ లేదా బట్ట వాడడం, స్కూళ్లలో మరుగుదొడ్లు, నీరు.. వాడిన వాటిని సరిగా పడేయగలిగే పరిస్థితులు ఇలాంటి వాటిమీద అవగాహనతో పాటు పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించేలా చూస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా పిల్లల స్థితిగతులు, యువత, నాయకత్వ లక్షణాలు అనే అంశాలమీద కార్యక్రమాలు, ప్రాజెక్టులు,నిధుల సేకరణ ద్వారా విద్యను అందించడం, అది సమాజంపై చూపే ప్రభావం గురించి చర్చించడానికి, అవగాహన కల్పించడమే ప్యూర్ సంస్థ ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకుంది.