Asianet News TeluguAsianet News Telugu

Punjagutta child dead body: బెంగళూరులో చంపి పంజగుట్టలో పడేశారు

హైదరాబాదులోని పజగుట్టలో అనుమానాస్పద స్థితిలో కనిపించిన చిన్నారి శవం మిస్టరీని పోలీసులు ఛేదించారు. పాపను బెంగళూరులో చంపేసి పంజగుట్టలో ఓ మహిళ పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

Punjagutta child dead body: Killed in Bengaluru, dunped at Punjagutta
Author
Punjagutta, First Published Nov 9, 2021, 11:56 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదారాబాదులోని పంజగుట్టలో అనుమానాస్పద స్థితిలో కనిపించిన నాలుగైదేళ్ల పాప హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పాపను కర్ణాటక రాజధాని బెంగళూరులో చంపేసి, శవాన్ని హైదరాబాదులోని పంజగుట్టలో మూసేసి ఉన్న దుకాణం ఎదుట పడేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Bengaluru నుంచి బస్సులో వచ్చి శవాన్ని పంజగుట్టలో పడేసినట్లు తెలుస్తోంది. ఓ మహిళ బస్సు దిగి Child Vead bodyతో నడిచి వచ్చి దుకాణం ముందు శవాన్ని వదిలేసినట్లు పోలీసులు నిర్ణారణకు వచ్చారు. నిందితులను పట్టుకునేందుకు హైదరాబాదు పోలీసులు బెంగళూరు వెళ్లారు. పాపను ఎందుకు చంపారనే విషయం వారు పట్టుబడితే గానీ తెలిసే అవకాశం లేదు. నిందితులను పట్టుకునేందుకు హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులు బెంగళూరు వెళ్లారు.

పాప శవాన్ని దుకాణం ముందు వదిలేసి మహిళ Hyderabadమెహిదీపట్నం వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఆమె బెంగళూరు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. దుకాణం ముందు ఇటీవల పాప శవం కనిపించడంతో తీవ్ర కలకలం చేలరేగిన విషయం తెలిసిందే.

Also Read: మూసి ఉన్న దుకాణం ఎదుట బాలిక మృతదేహం మిస్టరీ...

శవానికి పోస్టుమార్టం చేయించిన తర్వాత పాపను Murder చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చి ఆ కోణంలో దర్యాప్తు సాగించారు. దీపావళి పర్వదినం రోజున పంజగుట్టలోని జేవీఆర్ పార్కు ఎందురుగా ఉన్న ద్వారాకపురి కాలనీలో మూసి ఉన్న షాపు ముందు పాప అచేతనంగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసుల కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చారు. దాంతో పంజగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక శవాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

బాలిక శవం పడి ఉన్న పరిసరాల్లో పోలీసులకు ఏ విధమైన రక్తం మరకలు కూడా కనిపించలేదు. దాంతో పాప హత్య ఇక్కడ జరగలేదని నిర్ధారణకు వచ్చారు. ఎక్కడో హత్య చేసి బాలిక శవాన్ని ఇక్కడ పడేసి ఉంటారని భావించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఓ మహిళ పాప శవాన్ని తీసుకుని వచ్చి పడేసినట్లు తెలుసుకున్నారు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి, పురోగతి సాధించారు. 

Also Read: పంజాగుట్ట బాలికది హత్యే... ఎంత ఘోరంగా చంపారంటే..: పోలీసుల చేతికి పోస్టుమార్టం రిపోర్టు

బాలిక మృతదేహంపై గాయాలు కూడా కనిపించాయి. అయితే, అత్యాచారం జరిగిన దాఖలాలు లేవు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు కూడా Punjagutta పోలీసులు తెప్పించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లకు బాలిక ఫొటోను పంపించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా బాలిక ఫోటోను పెట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios