Asianet News TeluguAsianet News Telugu

పంజాగుట్ట బాలికది హత్యే... ఎంత ఘోరంగా చంపారంటే..: పోలీసుల చేతికి పోస్టుమార్టం రిపోర్టు

దీపావళి పండగరోజు హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో ఓ షాప్ ఎదుట అనుమానాస్పద రీతిలో లభించిన చిన్నారిది హత్యేనని పోలీసులు తేల్చారు. 

punjagutta girl murder case... Postmortem report handed over to Police
Author
Hyderabad, First Published Nov 8, 2021, 10:48 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్‌: దీపావళి  పండగ రోజే హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితితో నాలుగైదేళ్ల బాలిక మృతదేహం లభించిన విషయం తెలిసిందే. ఓ మూసివున్న దుకాణం బయట చిన్నారి మృతదేహం పడివుండటం కలకలం రేపింది. అయితే సదరు బాలికది హత్యేనని తాజాగా పోలీసులు తేల్చారు.  
 
పోస్టుమార్టం నివేదికలో బాలిక కడుపులో బలంగా తన్నడం వల్లే చనిపోయినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. చనిపోయిన తర్వాతే బాలిక మృతదేహాన్ని ఓ మహిళ తీసుకువచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకాపురి కాలనీలో మూసివున్న షాప్ ముందు పడేసినట్లు సిసి కెమెరాల ఆధారంగా గుర్తించినట్లు తెలిపారు. సదరు మహిళ వెల్లిన మార్గాల్లోని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. 

చిన్నారిని హత్యచేసిన నిందితులను పట్టుకునేందుకు నాలుగు పోలీస్‌, మూడు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పనిచేస్తున్నాయి. త్వరలోనే నిందితులను పట్టుకుని బాలిక హత్య మిస్టరీని చేధిస్తామని పోలీసులు తెలిపారు. 

read more  స్నేహితుడి భార్యపై కన్ను... బెదిరించి పలుమార్లు అత్యాచారం, బ్లాక్ మెయిల్....

దీపావళి రోజు (గత గురువారం) ఉదయం జేవీఆర్ పార్కు ఎదుట ద్వారకపురి కాలనీలోని మూసిఉన్న దుకాణం ఎదుట బాలిక అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు బాలిక మృతిచెందినట్లు గుర్తించారు. 

అయితే ఆ పరిసరాలంతా పరిశీలించి పోలీసులు ఎక్కడా రక్తపు మరకలు లేకపోవడంతో ఘటన ఇక్కడ జరగలేదని నిర్ధారణకు వచ్చారు. ఎక్కడో murder చేసి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ పడేసి ఉంటారని అనుమానంతో సమీపంలోని దాదాపు వందలకుపైగా కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఓ మహిళ బాలిక మృతదేహాన్ని తీసుకువచ్చి పడేసినట్లు గుర్తించారు.  

read more  ఇల్లు చూపిస్తానని మహిళపై గ్యాంగ్ రేప్: నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులు

బాలిక మృతదేహంపై పాత గాయాలున్నాయని... అత్యాచారం జరిగిన దాఖలాలు లేవని పశ్చిమ మండలం జాయింట్ కమిషనర్ ఏ ఆర్ శ్రీనివాస్ వెల్లడించారు.  రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు... రాష్ట్రవ్యాప్తంగా missing case వివరాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాలికది హత్యగా తేలింది. 

ఇప్పటికే రాష్ట్రంలోని అన్నిఠాణాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో బాలిక చిత్రాన్ని విడుదల చేసినట్టు పోలీసులు చెప్పారు.  బాలికకు సంబంధించిన వివరాలేమయినా తెలిస్తే ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి (9490616610),  డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగయ్య(9490616613), ఎస్సై సతీష్ (9490616365)లకు తెలియజేయాలని పోలీసులు కోరారు.  

ఇదిలావుంటే హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీ 12వ వార్డులో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కూతురిపైనే ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  

ఇబ్రహీంపట్నంలో నివాసముండే 35యేళ్ల వ్యక్తికి భార్య, పదేళ్ల కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. భార్య అనారోగ్యం కారణంగా కుమారుడితో కలిసి ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆ మృగాడు మద్యంమత్తులో ఇంటికి వచ్చాడు. కామంతో కల్లుమూసుకుపోయిన అతడు ఒంటరిగా వున్న కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఇలాంటి  ఘటనలు తరచుగా జరుగుతుండడం భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రులే కూతుర్ల పాలిట కీచకులుగా మారుతున్నారు. వావివరసలు మరిచి కర్కశంగా కాటేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. వారి ఉసురు తీస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios