హైదరాబాద్: చర్లపల్లి జైలు వద్ద ఉన్న డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో  ఉన్న నిందితులను తమకు అప్పగించాలని యువకులు ఆదివారం నాడు ఆందోళనకు దిగారు. దీంతో  ఉద్రిక్తత నెలకొంది. చర్లపల్లి జైలు వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

డాక్టర్ ప్రియాంక రెడ్డిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేసిన నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు నవంబర్ 30వ తేదీన తరలించారు.ఆదివారం నాడు  ఉదయం న్యాయవాదులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున చర్లపల్లి జైలు వద్దకు చేరుకొన్నారు.

డాక్టర్ ప్రియాంక రెడ్డిని హత్య చేసిన నిందితులను అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చర్లపల్లి జైలు ముందు వాళ్లంతా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.చర్లపల్లి జైలు గేటు నుండి లోపలికి వెళ్లేందుకు వాళ్లంతా ప్రయత్నించారు. జైలు అధికారులు నిరసనకారులను అడ్డుకొన్నారు.

చర్లపల్లి జైలు వద్దకు సాధారణ పోలీసులు భారీగా మోహరించారు. చర్లపల్లి జైలు వద్ద మహిళ సంఘాలు, న్యాయవాదులు, యువకులు బైక్‌లపై ర్యాలీగా వచ్చారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి ఫోటోలు ఉన్న ప్ల కార్డులను చేతిలో పట్టుకొని  నిరసన వ్యక్తం చేశారు.

తమకు న్యాయం చేయాలని నిరసన కారులు చెబుతున్నారు. అన్యాయం కోసం మేం రాలేదు. న్యాయం కావాలని కోరుకొంటున్నామని నిరసనకారులు చెప్పారు.  నిందితులను వెంటనే శిక్షించాలని  వారు డిమాండ్ చేస్తున్నారు.

విదేశాల్లో మాదిరిగా ఉన్న తరహలో చట్టాలను అమలు చేయాలని  నిరసనకారులు కొనసాగుతున్నారు. నిందితులను ఉరేసి చంపాలి, లేదా  తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: మా ఇంటికి రావొద్దు: ప్రియాంక పేరెంట్స్, ఇంటికి తాళం వేసుకుని....

డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డాక్టర్ ప్రయాంక రెడ్డి మిస్సింగ్ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు వ్యవహరించిన తీరు కూడ తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

Also Read: డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య: నిందితులు ముందే దొరికినా వదిలేశారు

రెండు  పోలీస్ స్టేషన్లలో తమ పరిధి కాదంటూ కూడ చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమ కూతురు బతికి ఉండేదేమోననే డాక్టర్ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. 

ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ చర్యలు తీసుకొన్నారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకొన్నారు. అయితే ప్రియాంక రెడ్డి హత్య జరిగిన తర్వాత చర్యలు తీసుకొంటే ఏం ప్రయోజనమనే అభిప్రాయాలు కూడ వ్యక్తం చేస్తున్నవారు లేకపోలేదు.