మహమ్మద్ ప్రవక్త ఇస్లాంకు గుండెకాయ వంటి వారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆయనను అవమానిస్తే తాము ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. నూపుర్ శర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల పై చర్యలు తీసుకోవాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. అలాగే ఖురాన్ బోధనల ప్రకారం ముస్లింలు జీవిస్తున్నారా లేదా అనే విషయంలో ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల‌ని ఆయన ముస్లింలను కోరారు. యువత విధ్వంసం వైపు కదలకూడదనుకుంటే వీడియో గేమ్స్ ఆడటం, బార్లకు వెళ్లడం, మద్యం సేవించడం, బాలికలు, మహిళలతో చెడుగా ప్రవర్తించడం మానుకోవాలని ఒవైసీ అన్నారు.

నల్గొండ జిల్లాలో ఓ కంపెనీలో పేలిన రియాక్టర్.. విషవాయువులు వ్యాపించడంతో ఆందోళనలో ప్రజలు

హైదరాబాద్ లోని దారుస్సలాంలో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వ‌ర్యంలో ‘జల్సా అజ్మత్-ఎ-ముస్తఫా’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేయడానికి ఇక్క‌డ స‌మావేశం అయ్యామని తెలిపారు. ‘‘మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. మద్దతు తెలిపినందుకు భారతీయ ముస్లింలకు ధన్యవాదాలు. నేను ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నానని ప్రజలు నన్ను అడుగుతున్నారు. విమానంలో నాతో పాటు ప్రయాణించే ఓ మ‌హిళా నేను పదునైన ప్రసంగాలు ఇస్తానని నాకు చెప్పింది. మీరు ఎందుకు అంత‌గా ఆందోళ‌న చెందుతున్నార‌ని ఆమె న‌న్ను అడిగింది. అయితే నేను ఆమెతో మాట్లాడుతూ.. మీ అమ్మ గురించి ఎవ‌రైనా చెడుగా మాట్లాడితే మీరు మౌనంగా ఉంటారా అని నేను అడిగాను. ప్రవక్త భార్య మన తల్లులకు తల్లి అని, ఆమె విష‌యంలో మేము ఎలా మౌనంగా ఉండ‌గ‌లం అని నేను ప్ర‌శ్నించాను.’’ అని ఓవైసీ అన్నారు. 

కరోనా కొత్త వేరియంట్ పై ‘ఇన్సాకాగ్’ ప్రత్యేక దృష్టి.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు..

‘‘ మేము అల్లాహ్ ను ప్రార్థించాలి. మేము అలానే చేస్తున్నాము. మహమ్మద్ ప్రవక్తను మక్కా ప్రజలు మూడు సంవత్సరాల పాటు సామాజికంగా బహిష్కరించారు. ప్రవక్త మన హృదయం లాంటివాడు. మీరు నా వేళ్లను కత్తిరించినా నేను భరిస్తాను. మీరు నన్ను బాధపెట్టినా దానిని కూడా స్వీకరిస్తాను. కానీ మీరు నా హృదయానికి దగ్గరగా రావాలనుకుంటే నేను నిశ్శబ్దంగా ఉండ‌లేను. ఎందుకంటే మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త ఇస్లాంకు గుండెకాయ ’’ అని ఆయ‌న అన్నారు. 

నిరసనకారులను శాంతిపజేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. ‘అగ్రిపథ్’ నియామకాలపై 5 కొత్త ప్రకటనలు.!

నూపుర్ శర్మపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీని, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తాము కోరుతున్నామ‌ని, కానీ అటు నుంచి స్పంద‌న లేద‌ని తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చిత్రపటాన్ని వక్రీకరించి, తొలగించినందుకు అక్రమ్ అలీని అదుపులోకి తీసుకున్నార‌ని, అలాగే పెద్దనోట్ల రద్దు తర్వాత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫొటోను షేర్ చేసినందుకు బల్లియా జిల్లాకు చెందిన బ్రిజేష్ యాదవ్ ను కూడా అరెస్టు చేశార‌ని ఆయ‌న తెలిపారు. ‘‘ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి పై ఎవ‌రైనా మాట్లాడితే వారిని జైలుకు పంపుతారు. 20 కోట్ల ముస్లిం ను బాధ‌పెట్టిన నూపుర్ శ‌ర్మ‌ను జైలుకు పంప‌డం ఆమెకు ఇష్టం లేదు’’ అని ఒవైసీ అన్నారు. చిన్న‌నాటి స్నేహితుడు అబ్బాస్ ను క‌లిసి తాను ఏమి చెబుతున్నానో అడ‌గాల‌ని ప్ర‌ధానిని ఓవైసీ కోరారు. త‌మ ఆవేద‌న నిజ‌మేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తార‌ని అన్నారు.