Asianet News TeluguAsianet News Telugu

నిరసనకారులను శాంతిపజేసేందుకు క్రేందం కీలక నిర్ణయం.. ‘అగ్రిపథ్’ నియామకాలపై 5 కొత్త ప్రకటనలు.!

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిఫథ్’ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ ఎంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయో తెలిసిందే. అయితే నిరసనకారులను శాంతింపజేసేందుకు నియామకాల్లో ఐదు కొత్త పక్రటనలు వెలువడ్డాయి.

5 New Announcements For Agnipath Scheme Recruits To Defuse Massive Protests
Author
Hyderabad, First Published Jun 19, 2022, 1:45 AM IST

కొత్త సైనిక నియామక ప్రణాళికపై ఆగ్రహంతో నిరసనకారులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం.. భయకరమైన కార్యాలయాలతో తీవ్రంగా నిరసన చేయడం దేశం మొత్తంగా సంచలనం సృష్టించింది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, యువత ఆందోళనకు దిగుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ‌లో జరిగిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. పలు రైళ్లను తగులబెట్టిన ఆందోళనకారులు, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. మరోవైపు సికింద్రాబాద్ విధ్వంసంపై మానవహక్కుల కమీషన్ స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న హెచ్ఆర్సీ.. జూలై 20లోపు ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్పీఎఫ్, జీఆర్పీ డీజీలను శనివారం ఆదేశించింది. 

ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా భారీ హింసకు దారితీసిన కొత్త అగ్నివీర్ మిలిటరీ రిక్రూట్‌మెంట్ పథకంతో ప్రభుత్వం అనేక కొత్త రాయితీలను ప్రకటించినట్టు తెలుస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం..  1. కోస్ట్‌గార్డ్‌లో 10 శాతం ఉద్యోగాలు మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిఫెన్స్ సంస్థల్లో రక్షణ మంత్రిత్వ శాఖ అగ్నివీర్స్‌కు రిజర్వ్ చేస్తుంది. 2. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు లేదా CAPFలు మరియు అస్సాం రైఫిల్స్‌లో 10 శాతం ఖాళీలను హోం మంత్రిత్వ శాఖ అగ్నివీర్‌ల కోసం రిజర్వ్ చేస్తుంది. 3. అగ్నివీర్లకు CAPFలు మరియు అస్సాం రైఫిల్స్‌లో రిక్రూట్‌మెంట్‌లకు వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు. 4. భారత నౌకాదళం నుండి అగ్నివీర్లకు మర్చంట్ నేవీలో ఉపాధి అవకాశాలు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ద్వారా ఇండక్షన్ కోసం ఆరు సేవా మార్గాలు.

చివరిగా.. అంతకుముందు, కోవిడ్ కారణంగా రిక్రూట్‌మెంట్‌లో రెండేళ్ల విరామం దృష్ట్యా అగ్నిపత్ స్కీమ్‌కు వయోపరిమితిని 21 నుండి 23కి ఒకసారి సడలింపుగా పెంచారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఉత్తీర్ణులైన అగ్నివీరుల కోసం అనుకూలీకరించిన కోర్సులను ప్రారంభించి, 12వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్‌ను అందించడంలో సాయం  చేస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios