బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు.. ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. జేపీ నడ్డా రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదని చెప్పారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు.. ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. జేపీ నడ్డా రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదని చెప్పారు. మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు అయిన సందర్భంగా వివిధ అంశాలపై జేపీ నడ్డా వారి అభిప్రాయాలు తెలిపారని.. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను తాను చెప్పడం జరిగిందని చెప్పారు. ఇది సుదీర్ఘమైన రాజకీయ చర్చ కాదని తెలిపారు. గుడ్ విల్ మీటింగ్ మాత్రమేనని అన్నారు.
ఎవరో ఏదో చెబితే మారిపోయే వ్యక్తి తాను కాదని.. బీజేపీ అలా అనకుంటుందని తాను అనుకోవడం లేదని అన్నారు. ఇది ఒకరికొకరు అభిప్రాయాలు పంచుకోవడానికి జరిగిన మీటింగ్ అని చెప్పారు. అభిప్రాయాలలో కొన్ని విషయాలను తాను అంగీకరించొచ్చు.. అంగీకరించకపోవచ్చని అన్నారు. నడ్డా కలిసినంతా మాత్రాన తన వైఖరిలో మార్పు రాదని తెలిపారు.
Also Read: 150 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. బండ్ల గణేష్
ఇక, తెలంగాణ పర్యటనకు విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో సమావేశమయ్యారు. సంపర్క్ సే అభియాన్‌లో ఈ భేటీ జరిగింది. టోలిచౌక్‌లోని ప్రొఫెసర్ నాగేశ్వర్ నివాసానికి వెళ్లిన జేపీ నడ్డా.. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్దిని ఆయనకు వివరించారు. అనంతరం కొద్దిసేపు ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో మాట్లాడారు. జేపీ నడ్డా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్‌తో పాటు కొందరు ముఖ్యనేతలు కూడా ఉన్నారు.
