GN Saibaba: నేను జైలు నుంచి బయటికి ప్రాణాలతో రావడమే వండర్: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మీడియాతో మాట్లాడారు. తాను జైలు నుంచి సజీవంగా బయటికి వస్తానని నమ్మేలేదని, తాను జైలులోనే మరణించడానికి చాలా అవకాశాలు ఉండేవని అన్నారు.
 

professor gn saibaba says cominig out of jail alive is wonder kms

Nagpur: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మీడియాతో మాట్లాడారు. ‘దారుణమైన జైలు జీవితాన్ని గడిపాను. నేను ప్రాణాలతో బయటికి రావడమే వండర్. నేను జైలులోనే మరణించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి’ అని జీఎన్ సాయిబాబా అన్నారు. తొలతు తాను మీడియా తో మాట్లాడటానికి నిరాకరించారు. తాను ముందుగా వెంటనే వైద్యులను సంప్రదించాలని, చికిత్స తీసుకోవాలని అన్నారు. చికిత్స తీసుకోకుండా మాట్లాడలేనని అన్నారు. 90 శాతం అంగవైకల్యంతో వీల్ చైర్‌కే ఆయన పరిమితం అయ్యారు. స్వయంగా తన వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేని వైకల్యాన్ని ఆయన అనుభవిస్తున్నారు.

కానీ, ఆయన వైద్యులు, న్యాయవాదుల సూచనల మేరకు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నా ఆరోగ్యం ఏ మాత్రం బాగాలేదు. నేను మాట్లాడలేను. ముందుగా నేను మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. ఆ తర్వాతే నేను మాట్లాడగలుగుతాను’ అని పేర్కొన్నారు. అయితే.. న్యాయవాదులు, వైద్యుల సూచనల మేరకు తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ‘నేను కనీసం నా చైర్‌ను నెట్టుకోలేను. చైర్ నుంచీ లేవలేను. నాకు నేనుగా టాయిలెట్‌కు కూడా వెళ్లలేను. ఈ రోజు సజీవంగా జైలు బయట అడుగుపెట్టానంటే అద్భుతమే అనిపిస్తున్నది.’ అని అన్నారు. 

Also Read: ముద్రగడతో వైసీపీ ప్లాన్ ఇదేనా? పవన్ కళ్యాణ్ విసుర్లు అందుకేనా?

తనపై కేసు కల్పితమైనదని, అవాస్తవ ఆరోపణలు అని జీఎన్ సాయిబాబా కొట్టిపారేశారు. ‘ఈ రోజు మీరు చూడొచ్చు. ఒక్కసారి కాదు, రెండు సార్లు ఉన్నత న్యాయస్థానం ఈ కేసు వాస్తవాలు లేకుండానే నమోదైందని, న్యాయపరంగా నిలబడదని ధ్రువీకరించింది. ఇంత కాలం ఎందుకు కేసును లాక్కువచ్చారు? నా పదేళ్ల జీవితం, నా సహ నిందితుల పదేళ్ల జీవితం. ఆ కాలాన్ని ఎవరు వెనక్కి తెచ్చివ్వగలరు?’ అని ప్రశ్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios