ప్రియాంక కుటుంబ సభ్యులు ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారు.

ప్రియాంకగాంధీ కుటుంబం ఈ రోజు అకస్మాత్తుగా హైదరాబాద్ లో ప్రతక్ష్యమైంది.

భర్త రాబర్ట్ వాద్రాతో పాటు వారి కుమారుడు రెహాన్ కూడా హైదరాబాద్ వచ్చారు.

ఇంతకీ వారి పర్యటన దీనికోసం అనేది ఇప్పటివరకు తెలియరాలేదు.

పార్టీకి సమాచారం కూడా ఇవ్వలేదని సమాచారం.

అయితే సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రియాంక కుటుంబ సభ్యులు ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారు.

రెహాన్ కంటికి సంబంధించిన ఆపరేషన్ పై చర్చించారు. 

ప్రియాంక కుటుంబం ఆస్పత్రికి వచ్చినట్లు తెలియడంతో అక్కడి పరిసరాల్లో పోలీసులు భద్రతను పెంచారు.