అభివృద్ధి దిశగా దేశం పరుగులు:508 రైల్వే స్టేషన్లలో పనులకు మోడీ శంకుస్థాపన

దేశంలోని 508 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు ఆదివారంనాడు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.

Prime Minister Narendra Modi lays foundation stone for redevelopment of 508 railway stations across country virtually today lns

హైదరాబాద్: అభివృద్ధి దిశగా దేశం పరుగులు పెడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద  508  రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ లలో  55,  బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, బెంగాల్ లో 37,  మధ్యప్రదేశ్ లో  34, అసోంలో 32, ఒడిశాలో  25,  పంజాబ్ లో 22,  గుజరాత్, తెలంగాణలలో  21,  జార్ఖండ్ లో  20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో  18,  హర్యానాలో  15, కర్ణాటకలో  13 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని  నాంపల్లి రైల్వే స్టేషన్ లో అభివృద్ది పనుల్లో  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.  రాష్ట్రంలోని  ఆదిలాబాద్, భద్రాచలం రోడ్డు, జనగామ, కామారెడ్డి, కరీంనగర్,  కాజీపేట, ఖమ్మం, మధి, మహబూబ్ నగర్ మహబూబాబాద్ , మలక్ పేట, మల్కాజిగిరి, నిజామాబాద్, రామగుండం, తాండూరు, రాయగిరి, జహీరాబాద్  రైల్వేస్టేషన్లను  అభివృద్ది చేయనుంది  ప్రభుత్వం.

 

ఈ సందర్భంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రసంగించారు.  రైల్వే స్టేషన్ల వద్ద  షాపింగ్ కాంప్లెక్స్, గేమింగ్ జోన్లు  ఏర్పాటు  చేసినట్టుగా  చెప్పారు. అభివృద్ధఇ  చేసిన తర్వాత ఈ స్టేషన్లు మల్లీ మోడల్ హబ్ లుగా మారతాయన్నారు.  దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి  శ్రీకారం చుట్టినట్టుగా  ప్రధాని తెలిపారు. 508 రైల్వే స్టేషన్ల అభివృద్దికి  రూ. 25 వేల కోట్లు కేటాయించినట్టుగా  ప్రధాని వివరించారు. అభివృద్ధే లక్ష్యంగా  పయనిస్తున్న  భారతదేశం స్వర్ణ యుగానికి నాంది పలికిందన్నారు. 

ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట పెరిగిందన్నారు. తమ ప్రభుత్వం  అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని మోడీ  చెప్పారు.  నెగిటివ్ రాజకీయాలకు అతీతంగా  సానుకూల రాజకీయ బాటలో  పయనిస్తున్నట్టుగా  మోడీ  పేర్కొన్నారు.క్విట్ ఇండియా స్పూర్తితో  దేశం మొత్తం  అవినీతి, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలు దేశం వీడి వెళ్లాలని కోరుకుంటున్నాయన్నారు.తమ పనిని చేయరు, ఇతరులను కూడ పనిచేసుకోనివ్వరని ఆయన  విపక్షాలపై  మండిపడ్డారు.


 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios