Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో శీతాకాల విడిది: సంప్రదాయానికి తెరతీసింది తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారంనాడు హైద్రాబాద్ కు వచ్చారు. ఐదు రోజుల పాటు  దక్షిణాది రాష్ట్రాల్లో ముర్ము పర్యటించనున్నారు. 

President Southern sojourn: Rajendra Prasad started it all in mid 1950s lns
Author
First Published Dec 18, 2023, 9:53 PM IST


హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  సోమవారంనాడు సాయంత్రం హైద్రాబాద్ కు చేరుకున్నారు. శీతాకాల విడిది కోసం  రాష్ట్రపతి ఇవాళ హైద్రాబాద్ కు వచ్చారు.  

భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్  దక్షిణాది రాష్ట్రాల పర్యటనను  1950 లో ప్రారంభించారు. 

బాబు రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్న కాలంలో  దక్షిణాది రాష్ట్రాల పర్యటన  నాలుగు వారాలు కొనసాగింది.  అయితే  ప్రస్తుతం అది  వారం అంతకంటే  తక్కువకు పరిమితమైంది. 

1955 ఆగస్టు 14న హైద్రాబాద్ రాజ్ ప్రముఖ్  ఉస్మాన్ అలీ ఖాన్, బొల్లారంలోని బ్రిటిష్ రెసిడెన్సీని  రాష్ట్రపతి రెసిడెన్సీ కోసం ఇచ్చారు.అప్పటి నుండి బొల్లారంలోని ఈ భవనం రాష్ట్రపతి నిలయంగా మారింది. 

దక్షిణాదిలో  రాష్ట్రపతికి రెండో నివాసం ఉండాలని అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ భావించాడు.  ఈ మేరకు  దక్షిణాదిన పరిశీలించారు. హైద్రాబాద్ లో  బొల్లారంలోని భవనం  రాష్ట్రపతి నివాసానికి ఉపయోగకరంగా ఉంటుందని భావించాడు.  రాష్ట్రపతి కోరిక మేరకు రాజ్ ప్రముఖ్ ఈ భవనాన్ని రాష్ట్రపతికి అప్పగించినట్టుగా చరిత్ర చెబుతుంది.

హైద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం  మూడో అధికారిక రాష్ట్రపతి నిలయం.   న్యూఢిల్లీలోని  రాష్ట్రపతి భవనం తొలి భవనం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్రపతి భవనం రెండో నివాసం.  హైద్రాబాద్ లోని బొల్లారంలోని  రాష్ట్రపతి నిలయం రాష్ట్రపతి మూడో అధికారిక నివాసంగా కొనసాగుతుంది.

1955 జూన్, జూలై మధ్య కాలంలో  హైద్రాబాద్ లో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ హైద్రాబాద్ బొల్లారంలో నివాసం ఉన్నాడు. ప్రతి ఏటా  ఐదు నుండి ఆరు వారాలు లేదా  ఎనిమిది నుండి పది వారాల పాటు  దక్షిణాది రాష్ట్రాల్లో  ఉండాలని అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ భావించారు.  

ఈ నిర్ణయంలో భాగంగా  మైసూర్, బెంగుళూరులో  1954లో  బాబు రాజేంద్ర ప్రసాద్  ఐదు వారాల పాటు పర్యటించారు.  1955 జూలై  మాసంలో  హైద్రాబాద్ లో  రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఆనాడు రాజేంద్రప్రసాద్  హైద్రాబాద్ లో మూడు వారాలు గడిపారు. అంతేకాదు  ఆంధ్ర, తమిళనాడుతో పాటు  కొచ్చిన్, ట్రావెన్ కోర్ వంటి ప్రాంతాలను కూడ  1956 తొలినాళ్లలో చూడాలని బాబు రాజేంద్రప్రసాద్ భావించారు. ఈ విషయాన్ని నెహ్రుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

దక్షిణాదిలో  రాష్ట్రపతికి నివాసం గురించి అప్పటి ప్రధానమంత్రి నెహ్రుకు రాసిన లేఖలో ప్రస్తావించారు. దక్షిణాదిలో నివాసం ఉంటే  ఈ ప్రాంతంలో పర్యటించేందుకు వీలుగా ఉంటుందని ఆయన  ఆ లేఖలో పేర్కొన్నారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు  సమయం వెచ్చించేందుకు కూడ అనుకూలంగా ఉండడానికి దక్షిణాదిలో కూడ  నివాసం ఉండాలని బాబు రాజేంద్రప్రసాద్ భావించాడు.

దక్షిణాదిలోని మైసూర్, బెంగుళూరు లేదా  హైద్రాబాద్ లలో  ఒక చోట నివాసం ఉండాలని అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ప్రతిపాదించాడు.  అయితే హైద్రాబాద్ బొల్లారంలోని  బ్రిటిష్ రెసిడెన్సీని  రాష్ట్రపతి భవనంగా పనికొస్తుందని భావించాడు. రాష్ట్రపతి సూచన మేరకు అప్పటి రాజ్ ప్రముఖ్  ఈ భవనాన్ని  రాష్ట్రపతి భవనం కోసం ఇచ్చారు. దీంతో అప్పటి నుండి  బొల్లారం నివాసం రాష్ట్రపతి భవనంగా మారింది.

అయితే  బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాతి  రాష్ట్రపతులు  దక్షిణాది పర్యటనలు పరిమితమయ్యాయి.ప్రతి ఏటా  డిసెంబర్ మాసంలో  వారం లేదా పది రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తారు.  హైద్రాబాద్ నుండి  పలు రాష్ట్రాల్లో  రాష్ట్రపతులు  పర్యటించేవారు

సోమవారంనాడు హైద్రాబాద్ కు  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం అనుముల రేవంత్ రెడ్డి,  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు  ఘనంగా స్వాగతం పలికారు. ఐదు రోజుల పాటు భారత రాష్ట్రపతి దక్షిణాదిలో పర్యటించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios