శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 29న హద్రాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి టూర్ ను పురస్కరించుకొని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్: శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 29న సికింద్రాబాద్‌ రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 వరకు ప్రెసిడెంట్ Ram Nath Kovind హైద్రాబాద్ లోనే ఉండే అవకాశం ఉంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటనను పురస్కరించుకొని వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. Cantonment బోర్డు అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించారు. రాజీవ్‌ రహదారికి ఇరువైపులా చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ఆయా ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు.రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విడిది సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Somesh kumar ఆదేశించారు. ప్రొటోకాల్‌ ప్రకారం కల్పించాల్సిన సదుపాయాలపై సీఎస్‌ మంగళవారం బీఆర్కే భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

also read:President Kovind Bangladesh Visit: బంగ్లాదేశ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘన స్వాగతం..

రాష్ట్రపతి నిలయంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి ఏటా డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైద్రాబాద్ కు వస్తారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి వారం రోజుల పాటు గడుపుతారు. హైద్రాబాద్ కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల్లో రాష్ట్రపతి టూర్ చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ ఏడాది డిసెంబర్ మాసంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం రానున్నారు.సీఎస్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో రహదారులు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాసరాజ్‌, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌, అడిషనల్‌ డీజీ జితేందర్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.;