కొత్త జోనల్ వ్యవస్థపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటన ఫలితం ఇచ్చింది. కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు సోమవారం రాత్రి, మంగళవారం గానీ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: కొత్త జోనల్ వ్యవస్థపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటన ఫలితం ఇచ్చింది. కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు సోమవారం రాత్రి, మంగళవారం గానీ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.
జోనల్ వ్యవస్థ సవరణ ఉత్తర్వుల జారీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చేరుకుంది. దాన్ని సోమవారంనాడే మంత్రిత్వ శాఖ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపే అవకాశం ఉంది.
తెలంగాణ జోనల్ వ్యవస్థ సవరణ ఫైల్ పై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రపతి ఉత్తర్వులు ఈ రెండు రోజుల్లోనే వెలువడుతాయని అంటున్నారు.
సవరించిన జోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం కేసిఆర్ ఢిల్లీలో మకాం వేసి, ప్రధాని నరేంద్ర మోడీని, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను, ఇతర కేంద్ర మంత్రులను కలిశారు.
ఈ వార్తలు చదవండి
తెలంగాణలో కొత్త జోన్లు ఇవే: ఏయే జిల్లాలు ఏ జోన్లలోకి...
