తెలంగాణలో కొత్త జోన్లు ఇవే: ఏయే జిల్లాలు ఏ జోన్లలోకి...

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 26, Aug 2018, 10:02 AM IST
New Zonal system of Telangana
Highlights

స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కే విధంగా తెలంగాణ ప్రభుత్వం జోన్ల వ్యవస్థను పునర్వ్యస్థీకరించింది. ఈ జోన్ల వ్యవస్థ అమలు కావాలంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర అనివార్యం.

హైదరాబాద్: స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కే విధంగా తెలంగాణ ప్రభుత్వం జోన్ల వ్యవస్థను పునర్వ్యస్థీకరించింది. ఈ జోన్ల వ్యవస్థ అమలు కావాలంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర అనివార్యం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు జోన్లుగా విభజించారు. ఈ జోన్ల వ్యవస్థ ఇలా ఉంటుంది.

1. కాళేశ్వరం జోన్: ఈ జోన్ లో 28.29 లక్షల జనాభా ఉంది. ఈ జోన్ లోకి భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు వస్తాయి.

2. బాసర జోన్: ఈ జోన్ లో 39.74 లక్షల జనాభా ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో ఈ జోన్ లోకి వస్తాయి. 

3. రాజన్న జోన్: ఈ జోన్ లో 43.09 లక్షల జనాభా ఉంది. ఈ జోన్ లోకి కరీంనగర్, సిద్ధిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు వస్తాయి. 

4. భద్రాద్రి జోన్: ఈ జోన్ లోకి 50.44 లక్షల జనాభా ఉంది. ఈ జోన్ లో వరంగల్ గ్రామీణ, వరంగల్ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు వస్తాయి. 

5. యాదాద్రి జోన్: ఈ జోన్ లో 45.23 లక్షల జనాభా ఉంది. ఈ జోన్ లోకి సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు వస్తాయి. 

6. చార్మినార్ జోన్: ఈ జోన్ లో 1.03 కోట్ల జనాభా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఈ జోన్ లోకి వస్తాయి. 

7. జోగులాంబ జోన్: ఈ జోన్ లో 44.63 లక్షల జనాభా ఉంది. మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు, వికారాబాద్

బహుళ జోన్ల పరిధిలోకి ఈ కింది జోన్లు వస్తాయి..

1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాది (1.61 కోట్ల జనాభా)
2. యాదాద్రి, చార్మినార్, జోగులాబం (1.88 కోట్ల జనాభా)

ఈ వార్తాకథనాలు చదవండి

కేసీఆర్ హ్యాపీ: కొత్త జోనల్ వ్యవస్థకు మోడీ గ్రీన్ సిగ్నల్

జోనల్ వ్యవస్థ అంటే ఏమిటీ?: మోడీ చేతికి చిక్కిన కేసీఆర్

loader