హైదరాబాద్: హైద్రాబాద్ జవహర్ నగర్‌లో రోడ్డుపైనే ఓ మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే సకాలంలో వైద్యం అందక పుట్టిన శిశువు మరణించాడు. నడిరోడ్డుపైనే ఉన్న బాలింతను స్థానికులు గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు.

హైద్రాబాద్ జవహర్ నగర్ లో ఓ గర్భిణీ ప్రసవం కోసం సోమవారం నాడు వెళ్లింది. అయితే వైద్యులు లేకపోవడంతో ఆమె తిరిగి వస్తుండగానే నడిరోడ్డుపైనే ప్రసవించింది. మగ పిల్లాడికి ఆమె జన్మనిచ్చింది.

సకాలంలో వైద్యం అందని కారణంగా ఆ బాలుడు మరణించాడు.  ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే  అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చేవరకు  బాలుడు చనిపోయినట్టుగా 108 సిబ్బంది తెలిపారు.

నడిరోడ్డుపై స్పృహ లేకుండా ఉన్న  బాలింతను  108 సిబ్బంది గాంధీ ఆసుపత్రికి తరలించారు.