ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి దూరంగా ఉంటున్నారు. అయితే, ఆదివారం పూసలబస్తీలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద విద్యాభూషణ్ కూతురితో కలిసి ఉండగా చెన్ని బాలకృష్ణ దాడి చేశాడు. విషయం తెలుసుకున్న వాణి అక్కడికి రాగానే బాలకృష్ణ, అతడి కుటుంబసభ్యులు ఆమెపై మూకుమ్మడిగా దాడికి దిగారు.
హైదరాబాద్ : పాత గొడవల నేపథ్యంలో wife and husbandపై బంధువులు దాడిచేసి గాయపర్చారు. పోలీసుల కథనం ప్రకారం సైదాబాద్ పూసలబస్తీకి చెందిన కావేటి వాణి, విద్యాభూషణ్ లు భార్యభర్తలు, వాణి సోదరుడు ఏడాదిన్నర క్రితం మేనమామ చెన్ని బాలకృష్ణ కూతురిని love marriage చేసుకున్నాడు.
అప్పట్లో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి దూరంగా ఉంటున్నారు. అయితే, ఆదివారం పూసలబస్తీలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద విద్యాభూషణ్ కూతురితో కలిసి ఉండగా చెన్ని బాలకృష్ణ దాడి చేశాడు. విషయం తెలుసుకున్న వాణి అక్కడికి రాగానే బాలకృష్ణ, అతడి కుటుంబసభ్యులు ఆమెపై మూకుమ్మడిగా దాడికి దిగారు.
దీంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. దాడి కారణంగా రెండు నెలల pregnant అయిన తనకు abortion జరిగినట్లు వాణి వాపోయింది. బాలకృష్ణ మీద చర్య తీసుకునేందుకు పోలీసులు జంకుతున్నారని ఆమె ఆరోపించింది. తనను చంపే ప్రయత్నం చేసిన అతనిమీద Murder attempt కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
తెలంగాణలో 5 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.
ఇదిలా ఉండగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మందుబాబుల ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. కొద్దిరోజులుగా మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నారు. ఇలా కొందరు drunk and drive చేస్తూ తమ ప్రాణాలనే కాదు ఎదుటివారిని రిస్క్ లో పడేస్తున్నారు. తాజాగా banjarahills ప్రాంతంలో మందుబాబులు కారును పల్టీలు కొట్టిస్తూ నానా బీభత్సం సృష్టించారు.
పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లోని నాగార్జున సర్కిల్ నుండి ఓ ఐ20 కారు బంజారాహిల్స్ వైపు మితిమీరిన వేగంతో దూసుకువెళుతూ ప్రమాదానికి గురయ్యింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో వేగంగా దూసుకుపోతున్న కారుకు ఓ స్కూటీ అడ్డొచ్చింది. అయితే దీన్ని తప్పించబోయి కారు అదుతప్పింది.
స్కూటీని తప్పించే క్రమంలో డ్రైవర్ కారును డివైడర్ వైపు తిప్పారు. దీంతో కారు డివైడర్ కు ఢీకొని గాల్లో పల్టీలు కొడుతూ రోడ్డుకు అవతలివైపు దూసుకెళ్లింది. అయినా కారు అదుపులోకి రాకుండా వేగంగా దూసుకెళ్లి మరో కారును ఢీకొట్టి ఆగిపోయింది.
ప్రమాదానికి కారణమైన కారును అక్కడే వదిలి ముగ్గురు యువకులు పరారయ్యారు. మద్యం మత్తులో కారును నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన యువకులు ఎవరన్నది తెలియాల్సి వుంది. ఐ20 కారు ఢీకొట్టడంతో ఎదురుగా వున్న కారులోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు గాయపడ్డారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మహ్మద్ ఆరిఫ్, ప్రణతి, దీక్ష, గ్లోరియా, సాయిలక్ష్మి, తేజస్విరెడ్డి, దుర్గా రాకేష్, గణేశ్ గాయపడ్డారు. అతివేగంతో ఢీకొనడంతో ఐ20 కారులో పాటు మరో కారు కూడా నుజ్జునుజ్జయ్యింది.
ప్రమాదానికి గురయిన సాఫ్ట్ వేర్ యువతీయువకులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. కారు నెంబర్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ఐ20కారు ఎవరిదనేది గుర్తించే పనిలో పడ్డారు. అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన మందుబాబుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
