Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ‌లో 5 కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల నియామ‌కం.

తెలంగాణలో ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్లకు సీఎం కేసీఆర్ చైర్మన్లను నియమించారు. చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఈ నామినేటెడ్ పోస్టులను ఎట్టకేలకు ఈ రోజు భర్తీ చేశారు.

Appointment of chairmen for 5 corporations in Telangana.
Author
Hyderabad, First Published Dec 17, 2021, 11:29 AM IST

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ ముగియ‌డంతో ఖాళీగా ఉన్న కార్పొరేష‌న్ చైర్మ‌న్ ల భ‌ర్తీపై దృష్టి పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్సీ ప‌దవులు ఆశించి భంగ‌ప‌డ్డ‌వారికి, ప‌లు సంద‌ర్భాల్లో సీఎం నుంచి హామీ పొందిన వారికి ఈ ప‌ద‌వులు ద‌క్కాయి. చాలా కాలంగా టీఆర్ఎస్‌తో మంచి సంబంధాలు క‌లిగి ఉన్న పలువురికి ఈ ప‌ద‌వుల్లో చోటు ద‌క్కింది. మొత్తంగా ఐదు కార్పొరేష‌న్ ప‌దువులు భ‌ర్తీ చేయాల‌ని సీఎం కేసీఆర్ భావించారు. వారి పేర్లుగా కూడా దాదాపుగా ఖ‌రారు అయిపోయాయి. ఎన్నో ఏళ్ల నుంచి హైద‌రాబాద్ బుక్ ఫెయిర్ నిర్వ‌హిస్తూ, ఆ బుక్ ఫెయిర్ క‌మిటీలో కీల‌క‌పాత్ర పోషిస్తున్న జూలూరి గౌరీశంక‌ర్‌కు ఈ సారి ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌నను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మ‌న్‌గా నియ‌మించాల‌ని సీఎం నిర్ణ‌యం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులురాలు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత కూడా ఈ ప‌ద‌వుల్లో స్థానం ల‌భించింది. ఆమెను తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మ‌న్‌గా నియమించారు. టీఆర్ఎస్ నాయకుడు గజ్జెల నగేష్ కు కూడా ఈ పదవుల్లో చోటు దక్కింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ గా ఆయ‌న‌ను ఎంపిక చేశారు. తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మ‌న్‌గా ఈ సారి పాటిమీది జగన్ మోహన్ రావుగా అవ‌కాశం ద‌క్కింది. అలాగే తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కూడా చైర్మ‌న్‌ను నియ‌మించారు. ఈ కార్పొరేష‌న్‌కు  దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను చైర్మ‌న్‌గా నియ‌మించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios