Asianet News TeluguAsianet News Telugu

ప్రీ పోల్ సర్వే: ఏ పార్టీకి ఎన్ని సీట్లు, రేవంత్ రెడ్డి బలమెంత?

వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) విజయకేతనం ఎగురేస్తుందని వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వే వెల్లడించింది.

Pre poll survey: The seats to be won by parties
Author
Hyderabad, First Published Sep 15, 2018, 9:10 AM IST

హైదరాబాద్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) విజయకేతనం ఎగురేస్తుందని వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. టీఆర్‌ఎస్‌కు 80 స్థానాలు, కాంగ్రెస్‌కు 20, ఎంఐఎంకు 8, బీజేపీకి 7, ఇతరులకు 4 స్థానాలు వస్తాయని ఈ సర్వే చెప్పింది. 

ఓటింగ్ శాతాల పరంగా చూస్తే.. టీఆర్‌ఎస్‌కు 41శాతం ఓటింగ్ లభిస్తుందని తెలిపింది. కాంగ్రెస్‌కు 27శాతం, బీజేపీకి 10 శాతం, ఎంఐఎంకు 6 శాతం, టీడీపీకి 4 శాతం, సీపీఐకి 2 శాతం, టీజేఎస్‌కు 2 శాతం, వైసీపీకి 1 శాతం, సీపీఎంకు 1 శాతం, ఇతరులకు 3 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే అంచనా వేసింది. 

ఎవరికి ఓటు వేయాలనే విషయంపై ఇంకా నిర్ణయించుకోనివారు మరో మూడుశాతం ఉన్నారని తెలిపింది. సర్వేకోసం తెలంగాణను గ్రేటర్ హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణగా వీడీపీ అసోసియేట్స్. విభజించింది.

టీఆర్‌ఎస్‌కు గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 42 శాతం, ఉత్తర తెలంగాణలో 41 శాతం, దక్షిణ తెలంగాణలో 39 శాతం ఓట్లు లభిస్తాయని అంచనావేసింది. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే తదుపరి ముఖ్యమంత్రి కావాలని 51 శాతం ఓటర్లు కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది. 

రెండోస్థానంలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నూటికి పది మంది మాత్రమే ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం కావాలని 6 శాతం, కోదండరాం సీఎం కావాలని 4 శాతం మంది కోరుకుంటున్నట్లు ప్రీ పోల్ సర్వేలో తేలింది. 

రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయల కల్పన ప్రాతిపదికగా ఓటేస్తామని 28 శాతం మంది  చెప్పగా, వ్యవసాయరంగం అభివృద్ధి ఆధారంగా ఓటేస్తామని 19 శాతం, మంది, ఉపాధి, ఉద్యోగాల కల్పన ప్రాతిపదికగా ఓటేస్తామని 17 శాతం మంది  చెప్పారు. 

మరో ఆసక్తికర అంశం.. రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ప్రధానంగా ప్రభావితం చేసేది ఏమిటన్న ప్రశ్నకు 25 శాతం మంది ముఖ్యమంత్రి అభ్యర్థి అని, 24 శాతం మంది ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓటేస్తామని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఓటేస్తామని 20 శాతం మంది ఓటర్లు చెప్పగాగా, కేంద్ర ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఓటేస్తామని 6 శాతం మంది, తెలంగాణ సెంటిమెంట్‌తో ఓటేస్తామని 8 శాతం మంది, ఇతర అంశాలతో ఓటేస్తామని 17 శాతం మంది ఓటర్లు చెప్పారు.

ఈ వార్తాకథనం చదవండి

ప్రీ పోల్ సర్వే: తెలంగాణలో కేసీఆర్ దే హవా

Follow Us:
Download App:
  • android
  • ios