డబ్బులు లేని ఏటిఎంలకు పూజలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన

ఎవరైనా ఏటిఎంలో డబ్బులు లేకపోతే వేరే ఏటిఎం దగ్గరికి వెళ్లిపోతారు. కానీ, నోట్ల రద్దు తో అన్ని ఏటిఎంలు ఇప్పడు ఖాళీగానే దర్శన మిస్తున్నాయి. ఒక వేళ ఏటిఎం లో డబ్బులుంటే అక్కడ బారెడు క్యూ ఉంటుంది.

నోట్ల రద్దును ఆకస్మికంగా రద్దు చేసిన కేంద్రం అందుకు తగ్గట్లు గా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చాలా ఏటీఎం లలో డబ్బులు రాకపోవడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు.

ప్రతిపక్షాలకు ఈ సమస్య పెద్ద ఆయుధంగా తయారైంది. అందుకే దీనిపై అన్ని మార్గాల్లో పోరాడుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నోట్ల రద్దుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

మంగళవారం నగరంలోని కొత్తపేటలో ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వద్ద కార్యకర్తలతో వచ్చిన ఆయన ఏటీఎంలలో డబ్బులు రాక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని, వెంటనే కేంద్రానికి కనువిప్పు కలగాలని కోరుతూ పూజారులతో ఏటీఎంలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొబ్బరికాయలు కొట్టి ఏటిఎంకు పూలమాలలు వేశారు.