హైదరాబాద్:పాకిస్తాన్ చెరలో ఉన్న ప్రశాంత్ అనే యువకుడి విషయంలో  ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రశాంత్ అదృశ్యమైన నాలుగు రోజులకే పాకిస్తాన్  ఆర్మీకి చిక్కినట్టుగా ప్రశాంత్ తండ్రి బాబురావు వెల్లడించాడు.

మంగళవారం నాడు ప్రశాంత్ తండ్రి బాబురావు తెలుగు మీడియా ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. సుమారు 8 మాసాల క్రితం ఓ వ్యక్తి వచ్చి తన కొడుకుతో పాటు తమ సమాచారాన్ని సేకరించారని చెప్పారు.

అయితే అతను వెళ్లే సమయంలో  తన కొడుకు పాకిస్తాన్‌లో ఉన్నాడని ఆయన చెప్పాడన్నారు. తన కొడుకు పాకిస్తాన్ లో ఉన్నట్టుగా తనకు సమాచారం ఇచ్చిన వ్యక్తి తన ఫోన్ నెంబర్ కూడ ఇవ్వలేదన్నారు. ఈ విషయాన్ని ఆ సమయంలో విధుల్లో ఉన్న మాదాపూర్ పోలీసులకు కూడ ఫిర్యాదు చేసినట్టుగా  ఆయన గుర్తు చేసుకొన్నారు.

తన కొడుకు సమాచారం సేకరించిన వ్యక్తి  రా ఏజంటా కాదా అనే సమాచారం కూడ తనకు తెలియదన్నారు. తన కొడుకు పాకిస్తాన్‌ ఆర్మీ ఇంత కాలం పాటు తన కొడుకును విచారించి కోర్టుకు అప్పగించిందేమోననే అభిప్రాయాన్ని బాబురావు వ్యక్తం చేశారు.

also read:పాక్ లో ప్రశాంత్ బందీ: స్విట్జర్లాండ్ లోని ప్రేయసిని కలిసేందుకు వెళ్తూ....

తన కొడుకును క్షేమంగా ఇంటికి తీసుకురావాలని బాబురావు వేడుకొంటున్నాడు. కొడుకును తలుచుకొని బాబురావు కన్నీళ్లు పెట్టుకొంటున్నాడు. పాకిస్తాన్  పోలీసుల చెరలో తాను ఉన్నట్టుగా ప్రశాంత్‌ ఉన్నాడు. ఈ మేరకు ప్రశాంత్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

ఈ వీడియోను పాకిస్తాన్ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. అంతర్జాతీయ మీడియా కూడ ఈ విషయమై వార్తా కథనాలను ప్రసారం చేసింది. ఈ మీడియా కథనాలపై తెలంగాణ పోలీసులు ఆరా తీస్తున్నారు.

also read:పాక్ చెరలో హైద్రాబాద్ యువకుడు: నిఘా వర్గాల ఆరా

ప్రశాంత్ విషయమై సైబరాబాద్ సీపీ సజ్జనార్ భారత ఎంబసీకి సమాచారం పంపారు. న్యాయ పరమైన చర్యలు ప్రారంభించినట్టుగా సజ్జనార్ తెలిపారు.ప్రశాంత్ సురక్షితంగా వస్తాడని  సజ్జనార్ అభిప్రాయపడ్డారు.