హైదరాబాద్: ప్రేమ వ్యవహారంతో తమతో ప్రశాంత్ విభేదించినట్టుగా ప్రశాంత్  తండ్రి బాబురావు చెప్పాడు. పాకిస్తాన్ పోలీసుల అదుపులో ఉన్న ప్రశాంత్  తండ్రి మంగళవారం నాడు ఉదయం మీడియాతో మాట్లాడారు.

Also read:పాక్ చెరలో హైద్రాబాద్ యువకుడు: నిఘా వర్గాల ఆరా

తన ప్రియురాలు స్వప్నిక పాండేను కలుసుకొనేందుకు తన కొడుకు వెళ్లినట్టుగా తాము అనుమానిస్తున్నట్టుగా ప్రశాంత్ తండ్రి బాబురావు చెప్పారు.తన ప్రియురాలు స్విట్జర్లాండ్‌లో ఉందనే విషయాన్ని తెలుసుకొని పాకిస్తాన్ ద్వారా స్విట్జర్లాండ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినట్టుగా తాము అనుమానిస్తున్నట్టుగా బాబురావు చెప్పారు. 2013 నుండి తాము హైద్రాబాద్‌లో ఉంటున్నట్టుగా  ఆయన చెప్పారు.

తన కొడుకు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవాడు కాదని  ఆయన అభిప్రాయపడ్డారు. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడని బాబురావు చెప్పారు. తన ప్రేమ గురించి ప్రశాంత్ ఏనాడూ చెప్పలేదన్నారు.

ఫేస్‌బుక్ ద్వారానే తాను ఈ విషయాన్ని తెలుసుకొన్నట్టుగా  చెప్పారు. తన ప్రియురాలు స్వప్నిక పాండే కోసం స్విట్జర్లాండ్ వెళ్లడం కోసం ప్రయత్నించినట్టుగా బాబురావు అనుమానిస్తున్నాడు.

తన కొడుకు ప్రశాంత్‌ను పాకిస్తాన్ పోలీసుల చెరలో ఉన్న విషయాన్ని మీడియాలో చూసిన తర్వాత ఇండియా ఎంబసీని కలిసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా ఆయన తెలిపారు.

ప్రేమ విషయమై ప్రశాంత్ ఏనాడూ కూడ తమతో చెప్పలేదన్నారు.స్వప్నిక పాండే ఏనాడూ తమను కాంటాక్ట్ చేయలేదన్నారు. మాదాపూర్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ప్రశాంత్ కన్పించకుండాపోయినట్టుగా ఆయన చెప్పారు.

2017 ఏప్రిల్ 29వ తేదీన ఈ విషయమై తాము పోలీసులకు కూడ ఫిర్యాదు చేశామన్నారు. ప్రశాంత్ వద్ద ఫోన్ కూడ లేదన్నారు. ప్రశాంత్ కోసం చాలా రోజులుగా గాలిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.ప్రశాంత్ డ్యూటీకి వెళ్లి 2017 ఏప్రిల్ 29వ తేదీ నుండి అదృశ్యమైనట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.