ఈ నెల 18న కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ: టీఆర్ఎస్ స్థితిగతులపై నివేదిక ఇచ్చే చాన్స్

ఈ నెల 18న తెలంగాణ సీఎం  కేసీఆర్ తో ఎన్నికల వ్యూఁహాకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కానున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్  పరిస్థితిపై ఐ ప్యాక్ నిర్వహించిన సర్వేకు సంబంధించిన నివేదికను కేసీఆర్ కు అందించనున్నారు ప్రశాంత్ కిషోర్.

Prashant Kishor To Meet Telangana CM  KCR On May 18 In Hyderabad


హైదరాబాద్:ఈ నెల 18వ తేదీన  Telangana సీఎం KCR తో Prashant kishor భేటీ  కానున్నారు.  టీఆర్ఎస్ తో ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితిపై ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ సర్వే చేస్తుంది. ఇప్పటికే  20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో TRS  పరిస్థితిపై ఐ ప్యాక్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ నివేదికను కేసీఆర్ కు I -PAC సంస్థ అందించింది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ స్థితిగతులపై ఐ ప్యాక్ సంస్థ సర్వే సమాచారాన్ని సీఎం కేసీఆర్ కు అందించనున్నారు.

also read:బీహార్ లో త్వరలోనే పాదయాత్ర: ప్రశాంత్ కిషోర్

ఈ ఏడాది  మార్చిలో  20 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికను కేసీఆర్ కు అందించారు ప్రశాంత్ కిషోర్. అయితే 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మినహా  మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ హావా ఉన్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 1 శాతానికి లోపుగా ఓట్ల శాతం టీఆర్ఎస్ కు, ప్రత్యర్ధి పార్టీకి ఉందని తేలింది.  మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై నివేదికను ఇవ్వాలని కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ను కోరారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై ప్రజలు ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారు, విపక్షాల బలాలపై కూడా ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ నివేదికను ఇవ్వనుంది. గత మార్చిలో ఇచ్చిన నివేదికలో ప్రభుత్వంపై ఉద్యమకారులు కొంత అసంతృప్తిగా ఉన్నారని నివేదిక తేల్చింది. అయితే మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందనే విషయమై కూడా ప్రశాంత్ కిషోర్ వివరించనున్నారు.

మరో వైపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గాంధీ జయంతి నుండి  పాదయాత్ర నిర్వహించనున్నట్టుగా కూడా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి దేశంలో కొత్త రాజకీయ పార్టీ లేదా సంస్థ వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ ప్రకటించారు. అయితే ప్రశాంత్ కిషోర్ తో ఈ విషయమై కేసీఆర్  చర్చలు జరుపుతున్నారనే వాదనలు కూడా లేకపోలేదు. తాను ఇప్పటికిప్పుడు పార్టీని ేర్పాటు చేయబోవడం లదేదని ప్రవాంత్ కిషోర్ చెప్పారు. మెరుగైన పాలన కోసం ఏం చేయాలనే దానిపై ప్రజలతో చర్చించనున్నట్టుగా చెప్పారు. సుమారు 17 వేల మందితో చర్చించిన మీదట వచ్చే సూచనల ఆధారంగా పార్టీ పెట్టాలో లేదా అనే విషయమై నిర్ణయం ప్రకటిస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన విసయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరుతారనే వార్తలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ పై ప్రశాంత్ కిషోర్ అసంతృప్తితో ఈ ఆఫర్ ను తిరస్కరించినట్టుగా ప్రచారంలో ఉంది. తమ పార్టీలో చేరడానికి ప్రశాంత్ కిషోర్ సుముఖంగా లేడని కూడా ఆ పార్టీ ఇదివరకే ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలనే దానిపై ప్రశాంత్ కిషోర్ కొన్ని కీలక సూచనలు ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios