బీహార్ రాష్ట్రంలో త్వరలోనే పాదయాత్రను నిర్వహిస్తానని ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. గురువారం నాడు పాట్నాలో మీడియాతో మాట్లాడారు.
పాట్నా:;పాదయాత్ర చేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొంటానని ఎన్నికల వ్యూహాకర్త Prashant kishor ప్రకటించారు.Bihar రాష్ట్రంలోనే పాదయాత్రను ప్రారంభించనున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు.
గురువారం నాడు పాట్నాలో ఆయన మీడియా మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని గత మాసంలో ఆయన ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారని కూడా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.ఈ తరుణంలో ఆయన మీడియా సమావేశంలో కీలక విషయాలను ప్రకటించారు. ఈ ఏడాది గాంధీ జయంతి రోజు నుండి పాదయాత్రను ప్రారంభించనున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.రాష్ట్రంలో సుమారు 3 వేల కి.మీ దూరం Padayatraచేస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల మందిని కలువనున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.సుపరిపాలనతో వారితో చర్చించనున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. వారు కలిసి వస్తే పార్టీని ప్రకటించినా కూడా అది ప్రశాంత్ కిషోర్ పార్టీ కాదన్నారు. ఆ పార్టీలో తాను ఒక సభ్యుడిగా కొనసాగుతానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
.బీహార్ రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్ తీసుకురావడానికి తాను పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన సుదీరథ రాజకీయ అనుభవాన్ని బీహార్ కోసం వినియోగిస్తానని ఆయన ప్రకటించారు.
ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని ఇవాళ ప్రకటిస్తారని ప్రచారం సాగింది. అయితే ఇవాళ మాత్రం ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీని ప్రకటించలేదు. బీహార్ రాష్ట్రంలో సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేనందున ప్రస్తుతానికి రాజకీయ పార్టీ తన ప్రణాళికలో లేదని ఆయన చెప్పారు.
దేశంలోనే పేద రాష్ట్రం బీహార్ అని ఆయన గుర్తు చేశారు. నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకం కానున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ చెప్పారు. బీహార్ అభివృద్ది కోసమే తాను పాదయాత్ర చేస్తానని ఆయన వివరించారు. Lalu prasad Yadav, నితీష్ కుమార్ యాదవ్ ల పాలనలో బీహార్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని ఆయన విమర్శించారు. రాబోయే పదేళ్లలో బీహార్ రాష్ట్రాన్ని ప్రగతి శీల రాష్ట్రంగా ఎదగాలంటే కొత్త ఆలోచనలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలంతా కలిసి కట్టుగా పనిచేస్తే అభివృద్ది సాధ్యమని ఆయన చెప్పారు. రానున్న మూడు నాలుగేళ్లలో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తానని కూడా ఆయన ప్రకటించారు.
Congress పార్టీకి చెందిన యాక్షన్ గ్రూప్ లో పని చేయాలని ఆ పార్టీ కోరిందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అయితే ఈ ఆఫర్ ను తాను తిరస్కరించినట్టుగా ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ సాధికారిత గ్రూప్ లో సభ్యుడిగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండదని తాను భావించినట్టుగా ఆయన వివరించారు.
ప్రశాంత్ కిషోర్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పారు. రాజకీయ వ్యూహా రచనచేయడం ప్రజలతో మమేకావడం రెండు భిన్నమైనవని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ అభిప్రాయపడ్డారు.ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు బీహార్ లో ప్లాఫ్ షో మాదిరిగా మారుతాయని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు.
