Asianet News TeluguAsianet News Telugu

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర: రెండు నెలలుగా ప్రసాద్ గౌడ్ రెక్కీ

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు రెండు నెలలుగా కిల్లెడ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ ప్లాన్ చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 
 

Prasad Goud Planned To Kill Armoor MLA jeevan Reddy
Author
Hyderabad, First Published Aug 3, 2022, 4:28 PM IST

హైదరాబాద్: Armoor ఎమ్మెల్యే Jeevan Reddyని చంపేందుకు రెండు నెలలుగా ప్రసాద్ గౌడ్ ప్లాన్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం నాడు ప్రసాద్ గౌడ్ ను  Hyderabad బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ గౌడ్ ను పోలీసులు ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు.

ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సస్పెన్షన్ కు గురైన Killeda సర్పంచ్ లావణ్య భర్తే ప్రసాద్ గౌడ్. ప్రసాద్ గౌడ్  వద్ద రెండు తుపాకులు, ఓ కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రెండు నెలలుగా ఎమ్మెల్యేను హత్య చేసేందుకు గాను  ప్రసాద్ గౌడ్ ప్లాన్ చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

హైద్రాబాద్ తో పాటు ఆర్మూర్ లో కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకుప్రసాద్ గౌడ్ ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమ్మెల్యేను ఎయిర్ గన్ తో హత్యచేసేందుకు ప్లాన్ చేశారు. నాందేడ్  లో తుపాకీని కొనుగోలు చేశారని పోలీసులు గుర్తించారని ఈ కథనం తెలిపింది. హైద్రాబాద్ లోని ఎమ్మెల్యే ఇంటిని కూడా ప్రసాద్ గౌడ్ క్షుణ్ణంగా రెక్కీ చేశారని పోలీసులు గుర్తించారు. మూడో అంతస్థు వరకు వెళ్లి ప్రసాద్ గౌడ్ రెక్కీ నిర్వహించారు. ఎమ్మెల్యేను హత్య చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలనే విషయమై  ప్రసాద్ గౌడ్ రెక్కీ నిర్వహించారని పోలీసులు గుర్తించారు.ఈ మేరకు ఎమ్మెల్యే నివాసంలోని సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.  ప్రసాద్ గౌడ్ తో పాటు ఈ కేసులో మరికొందరి ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంది. 

ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన ప్రసాద్ గౌడ్ నేరుగా  మూడో అంతస్థులో కూడా కలియదిరిగారని పోలీసులు గుర్తించారు. ఎప్పుడెప్పుడు ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యే ఇంటికి వచ్చాడనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారుగతంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ప్రసాద్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేకు వేల కోట్ల రూపాయాలు ఎలా వచ్చాయని కూడా ప్రసాద్ గౌడ్ ప్రశ్నించారు.ఈ మేరకు ఈ వీడియోలు గతంలో మీడియాలో ప్రసారమయ్యాయి.ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యేకు ఇచ్చిన వార్నింగ్ నేపథ్యాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం.

also read:ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర: హైద్రాబాద్ లో ఒకరి అరెస్ట్

 కిల్లెడలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన నిధులు రాలేదని సర్పంచ్ చెబుతున్నారు.ఈ విషయమై ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు వెళ్తే తన భర్తపై తప్పుడు కేసులు బనాయించారని ఆమె మీడియాకు చెప్పారు. పలు మీడియా చానెల్స్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు.తన భర్తపై తప్పుడు కేసులు బనాయించారని ఆమె చెప్పారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి సుమారు రూ. 50 వేలను వడ్డీల రూపంలో చెల్లించాల్సి వస్తోందని ఆమె చెబుతున్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నందున ఈ బిల్లులు  చెల్లించాలని అధికారులు, ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆ ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios