ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర: హైద్రాబాద్ లో ఒకరి అరెస్ట్
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని కిల్లెడ సర్పంచ్ ను సస్పెండ్ చేయించడంతో ఆమె భర్త ఎమ్మెల్యేను హత్య చేసేందుుకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే Jeevan Reddy హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని హైద్రాబాద్ Banjarahills పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. Armoor నియోజకవర్గంలోని Killeda గ్రామసర్పంచ్ భర్త ఈ ఈ కుట్రకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించిన ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు.
తన భార్యను సర్పంచ్ పదవి నుండి సస్పెండ్ చేయించడంతో ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్న నిందితుడు ఎమ్మెల్యేను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి వద్ద కత్తి, పిస్టల్ ను స్వాధీనం చేసుకొన్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ తెలిపింది. ఎమ్మెల్యే సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే పోలీసులు షాక్ కు గురయ్యారు. నిందితుడి వద్ద నుండి కత్తి,పిస్టల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
కిల్లెడ గ్రామ సర్పంచ్ గా లావణ్య గతంలో పనిచేసింది.ఆమెను ఎమ్మెల్యే సస్పెండ్ చేయించారు. దీంతో సస్పెన్షన్ కు గురైన లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యేకి ప్రసాద్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారని కూడా ఆయన అనుచరులు గుర్తుచేస్తున్నారు.
ప్రతి రోజూ నియోజకవర్గంలోని ప్రజలు వచ్చి కలుస్తుంటారు. నియోజకవర్గం నుండి వచ్చిన వారికి టిఫిన్,భోజన వసతి కల్పిస్తారు. రెండు రోజులుగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద ప్రసాద్ గౌడ్ రెక్కీ నిర్వహించారని కూడా జీవన్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు.ఈ విషయమై జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ టీవీ 9 కథనం తెలిపింది. కిల్లెడ గ్రామం నుండి వచ్చిన వారు ప్రసాద్ గౌడ్ ను గుర్తించి ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే సిబ్బందికి సమాచారం ఇచ్చారు.దీంతో ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ప్రసాద్ గౌడ్ ను అరెస్ట్ చేశారు. ప్రసాద్ గౌడ్ వద్ద పిస్టల్, కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యేకు గతంలో వార్నింగ్ ఇచ్చిన ప్రసాద్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సందర్భంలో హత్యకు కుట్ర పన్నారని ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు.ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మీడియా చానెల్స్ కథనాలు ప్రసారం చేశాయి.