హైదరాబాద్: ప్రణయ్ హత్య కేసులో చార్జిషీట్ కు భయపడి అమృత వర్షిణి తండ్రి మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. తీవ్రమైన శిక్ష పడే అవకాశం ఉందనే భయంతోనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. తన కూతురు అమృత వర్షిణిని ప్రేమ వివాహం చేసుకున్న దళిత యువకుడు ప్రణయ్ ను మారుతీ రావు 2018 సెప్టెంబర్ 14వ తేదీన కిరాయి హంతకులతో హత్య చేయించిన విషయం తెలిసిందే. 

ప్రణయ్ హత్య జరిగిన రోజు జ్యోతి ఆస్పత్రి వద్ద పోలీసులు అమృత వర్షిణి వాంగ్మూలాని పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు మారుతీ రావు, అమృత, బాలస్వామి, శ్రవణ్ వాంగ్మూలాలను తీసుకున్నారు. వారి వాంగ్మూలాలను పోలీసులు చార్జిషీట్ లో పొందు పరిచారు. 

Also Read: ప్రణయ్ హత్య: 1200 పేజీలతో చార్జీషీట్, ఏ-1 మారుతీరావు

ప్రణయ్ ను తన తండ్రి మారుతీ రావు, బాబాయ్ శ్రవణ్ చంపించారని అమృత తన వాంగ్మూలంలో స్పష్టంగా ఆరోపించింది. తక్కువ కులం వాడితో మాట్లాడకూడదని మారుతీ రావు తనకు చెబుతుండేవాడని ఆమె అన్నది. ప్రణయ్ తల్లిదండ్రులను మారుతీ రావు, శ్రవణ్ బెదిరించారని ఆమె ఆరోపించారు.  

మారుతీ రావు కూడా తన వాంగ్మూలంలో దాదాపుగా నేరాన్ని అంగీకరించినట్లు అర్థమవుతోంది. ప్రణయ్ ని పెళ్లి చేసుకుని అమృత తమ పరువు తీసిందని మారుతీ రావు చెప్పాడు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని అన్నాడు. రాయబారం నడిపినా కూడా తన కూతురు రాలేదని చెప్పాడు. ప్రణయ్ హత్యకు అవసరం కాబట్టి డబ్బు సమకూర్చాలని తన తమ్ముడు శ్వరణ్ కు చెప్పినట్లు ఆయన తెలిపాడు. ప్రణయ్ ను కాదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అమృత తమను బెదిరించిందని ప్రణయ్ తండ్రి బాలస్వామి వాంగ్మూలంలో చెప్పారు. ప్రణయ్ ను చంపేస్తామని పలుమార్లు తమను బెదిరించారని ఆయన ఆరోపించారు. 

Alos Read: బిగ్ బ్రేకింగ్ : కుప్పకూలిన అమృత, అస్పత్రికి తరలింపు

ప్రణయ్ హత్య కేసులో 8 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేశారు. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.