మిర్యాలగుడా: అమృత వర్షిణి భర్త ప్రణయ్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. అమృత తండ్రి అమృత తండ్రి మారుతీరావును పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. మారూతీ రావుతో పాటు కరీంను కూడా అరెస్టు చేశారు. మారుతీరావు, కరీం, వెంకటేశ్వర రావులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఆ ముగ్గురిపై 452, 506, 195ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆస్తుల పేరుతో తనను ప్రలోభపెట్టడానికి తన తండ్రి మారుతీ రావు ప్రయత్నిస్తున్నారని అమృత ఫిర్యాదు చేసింది.

Also Read: మారుతీరావు బెదిరిస్తున్నాడు... ప్రణయ్ తండ్రి ఆవేదన

అమృత ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ నెల 11వ తేదీన మారుతీ రావు మిర్యాలగుడాలోని తన ఇంటికి వేంకటేశ్వర రావు అనే వ్యక్తిని పంపించారని, ఆస్తి పంపకాలపై తనను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమృత తన ఫిర్యాదులో తెలిపింది. 

అమృత ఫిర్యాదు మేరకు పోలీసులు మారుతీరావు, కరీం, వెంకటేశ్వర రావులపై కేసు నమోదు చేశారు. తన కూతురు అమృత ప్రణయ్ ను ప్రేమ వివాహం చేసుకోవడాన్ని మారుతీ రావు జీర్ణించుకోలేకపోయారు. కులాంతర వివాహం చేసుకున్న తన కూతురు అమృత భర్త ప్రణయ్ ను హత్య చేయించారు. ఈ కేసులో మారుతీరావుకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.