హైదరాబాద్: దళిత అల్లుడు ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు విషం కారణంగానే మరణించినట్లు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో తేలింది. మారుతీరావు శరీరమంతా విషం పాకినట్లు తెలుస్తోంది. దాంతో మారుతీ రావు మృతదేహం నీలం రంగులోకి మారిపోయింది.

మారుతీ రావు ఒంటిపై ఏ విధమైన గాయాలు లేవని ఫోరెన్సిక్ నిపుణుల ప్రాథమిక నివేదికలో తేలింది. అయితే, మారుతీ రావు ఏ విధమైన విషం తీసుకున్నాడనే విషయాన్ని కనుక్కోవడానికి ఫోరెన్సిక్ నిపుణులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

Also Read: మారుతీరావు ఆత్మహత్యపై దర్శకుడి కామెంట్స్..!

హైదరాబాదులోని ఖైరతాబాద్ చింతలబస్తీలో గల ఆర్యవైశ్య వసతిృహంలోని గదిలో మారుతీ రావు శవమై తేలిన విషయం తెలిసిందే. అతను ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తూ వస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మారుతీరావు మృతదేహాన్ని మిర్యాలగుడాకు తరలించారు. రెండేళ్ల క్రితం తన కూతురు అమృత వర్షిణి ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ ను మారుతీ రావు కిరాయి హంతకులతో హత్య చేయించాడు. ఆ కేసు ట్రయల్ తుది దశకు చేరుకుంది. దానికితోడు, కుటుంబంలో ఆస్తి తగాదాలు కూడా ప్రారంభమైనట్లు చెబుతున్నారు. 

Also Read: మారుతీరావు కి తలకొరివి పెట్టనున్న తమ్ముడు, అమృతకు దక్కని అవకాశం

రాయబారాలు పంపినప్పటికీ కూతురు వెనక్కి రావడానికి ఇష్టపడలేదు. ఈ స్థితిలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై మారుతీ రావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.