మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు శనివారం అర్ధరాత్రి తరువాత హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్యా భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనపై 'పలాస 1978' దర్శకుడు కరుణకుమార్ స్పందించారు. ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకొని అందమైన జీవితాన్ని ఊహించుకున్నారని.. అమ్మాయి గర్భందాలిస్తే భర్త ఆమెని చెకప్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్తే.. నడిరోడ్డు మీద నరికేశారని అన్నారు.

మారుతీరావు కి తలకొరివి పెట్టనున్న తమ్ముడు, అమృతకు దక్కని అవకాశం

ఈ ఘటన జరగడానికి ముందు వాళ్లు తమకు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్ని కలలు కనుంటారు..? అవన్నీ ఒక్క క్షణంలోనే చిద్రమైపోయినట్లే కదా అని అన్నారు. దీనంతటికీ కారణం కులమని.. ఈ ఘటన జరిగిన ఏడాది అవుతోందని.. ఇప్పుడు ఆ అమ్మాయి తండ్రి కూడా చనిపోయాడని అన్నారు.

ఆ అబ్బాయి నిజంగానే మంచివాడు కాకపోతే అప్పుడు వద్దమ్మా అని చెప్పినా అర్ధం ఉంటుందని.. అంతేకానీ తక్కువ కులానికి చెందినవాడని చంపడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. మారుతీరావు అలా చనిపోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదని అన్నారు.