బాలిక స్నానం చేసేందుకు వెళ్లగానే ఆ యువకుడు ఏం చేశాడంటే?

Pranay arrested for sexual harassment in Hyderabad
Highlights


హైదరాబాద్: మైనర్ బాలికపై కన్నేసిన ఓ యువకుడు బాత్‌రూమ్‌లో ఆమె స్నానం చేస్తుండగా  బలవంతంగా బాత్‌రూమ్ తలుపులు తెరిచి  అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక తల్లి రావడంతో నిందితుడు పారిపోయాడు.


హైదరాబాద్: మైనర్ బాలికపై కన్నేసిన ఓ యువకుడు బాత్‌రూమ్‌లో ఆమె స్నానం చేస్తుండగా  బలవంతంగా బాత్‌రూమ్ తలుపులు తెరిచి  అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక అరుపులు  విని నిందితుడు పారిపోయాడు. 

హైద్రాబాద్  బంజారాహిల్స్ లో మైనర్ బాలిక కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటుంది.  అయితే  బాధితురాలిపై కన్నేసిన ప్రణయ్ అనే యువకుడు  పలు మార్లు ఆమెను వేధింపులకు గురిచేశాడు. 

అయితే  ఆదివారం రాత్రి పూట బాలిక  బాత్‌రూమ్‌లోకి వెళ్లడాన్ని గమనించిన  నిందితుడు బలవంతంగా బాత్‌రూమ్ తలుపులు తెరిచి  లోపలికి వెళ్లిపోయాడు.  అంతేకాదు బాధితురాలిపై లైంగిక దాడికి ప్రయత్నించాడుబాధితురాలు అరవకుండా ముఖానికి కర్చీఫ్ కట్టాడు. 

అయితే బాత్‌రూమ్‌లో శబ్దాలు రావడంతో బాధితురాలి తల్లి వచ్చి తలుపులు కొట్టింది. దీంతో నిందితుడు పారిపోయాడు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు  పోలీసులు  ప్రణయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడిపై  ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

loader