KA Paul: సీఎం రేవంత్ రెడ్డితో కేఏ పాల్ భేటీ.. దేనికోసం కలిశారంటే?
ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సీఎం రేవంత్ రెడ్డిని ఈ నెల 13వ తేదీన కలిశారు. తాజగా ఇందుకు సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. గ్లోబల్ పీస్ మీటింగ్ పర్మిషన్ కోసం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యానని, తాను అనుమతులు ఇస్తామని, ఆహ్వానం మేరకు హాజరు కూడా అవుతానని హామీ ఇచ్చాడని కేఏ పాల్ వివరించారు.
Revanth Reddy: ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన నివాసంలో కలిసినప్పటి ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేఏ పాల్ ఏది చేసినా సంచలనమే అవుతున్నది. అలాంటి.. కేఏ పాల్ సీఎం రేవంత్ రెడ్డిని ఎప్పుడు కలిశారు? ఎందుకు కలిశారు? అనే అంశాలపై ఆసక్తి ఏర్పడింది.
సీఎం రేవంత్ రెడ్డిని ఆయన డిసెంబర్ 13వ తేదీనే కలిసినట్టు కేఏ పాల్ తెలిపారు. జనవరి 30వ తేదీన జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు అనుమతి కోసం తాను సీఎంను కలిసినట్టు వివరించారు. ఈ పర్మిషన్ ఇంకా ఇవ్వలేదని తెలిపారు. ఈ అనుమతులు వచ్చాక ఫొలోలు బయటకు విడుదల చేస్తామని అనుకున్నామని, అందుకే అప్పుడు విడుదల చేయలేదని వివరించారు. అయితే, ఇన్ని రోజులైనా పర్మిషన్ రాకపోవడంతో ఇప్పుడు రిలీజ్ చేసినట్టు చెప్పారు.
వరల్డ్ పీస్ మీటింగ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలనూ అతిథులుగా పిలిచినట్టు వివరించారు. కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలాను కూడా ఆహ్వానించినట్టు చెప్పారు. మొత్తం 120 దేశాల నుంచి 60 వేల మంది వరకు పీస్ వర్కర్స్ ఈ మీటింగ్‌కు వస్తారని తెలిపారు. పీస్ మీటింగ్ ఈ నెల 30వ తేదీన జరగాల్సి ఉన్నది. కానీ, ఇప్పటి వరకు ఎక్కడ నిర్వహించాలనేది తేలలేదు. అనుమతులూ రాలేవు.
Also Read: క్లాస్‌మేట్‌ను పెళ్లి చేసుకోవాలని సెక్స్ చేంజ్ చేసుకుంది.. తర్వాత ఆమెనే చంపేసింది
ఈ సమావేశం నిర్వహిస్తే తెలంగాణ అప్పులు కొంత తీరడానికి, ఆరు గ్యారంటీలు నెరవేరడానికి, వేల కోట్ల డొనేషన్లు సేకరించడానికి, లక్ష కోట్ల పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు.