Asianet News TeluguAsianet News Telugu

క్లాస్‌మేట్‌ను పెళ్లి చేసుకోవాలని లింగ మార్పిడి చేసుకుంది.. తర్వాత ఆమెనే చంపేసింది

చెన్నైలో లింగ మార్పిడి చేసుకుని యువతి నుంచి యువకుడిగా మారిన ఓ వ్యక్తి తనతో కలిసి చదువుకున్న యువతిని దారుణంగా హత్య చేశాడు. ఆమె ఓ యువకుడిపై ఆసక్తి కనబరుస్తున్నదనే అనుమానంతో చంపేసినట్టు అనుమానిస్తున్నారు. బర్త్ డే సెలబ్రేషన్ కోసం ఆమెను రప్పించుకుని సర్‌ప్రైజ్ ఇస్తానని కళ్లు మూసి, చైన్లతో కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
 

software engineer killed former classmate after undergone sex change operation kms
Author
First Published Dec 25, 2023, 3:52 PM IST

చెన్నై: వాళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ యువతులు ఇద్దరూ క్లాస్‌మేట్లు. ఒకరంటే ఒకరికి అమితమైన అభిమానం. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం ఒకరు సెక్స్ చేంజ్ చేసుకుంది. కానీ, లింగ మార్పిడి చేసుకున్న యువకుడు.. ఆమెనే పొట్టనబెట్టుకున్నాడు. తాను లింగ మార్పిడి చేసుకున్న తర్వాత ఆమె మరో యువకుడిపై ఆసక్తి చూపుతున్నదనే అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. సర్‌ప్రైజ్ బర్త్‌డే సెలబ్రేషన్ అని చెప్పి ఆమెను రప్పించి, కళ్లు మూసి చేతులు కట్టేసి సజీవ దహనం చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.

కేళంబక్కం సమీపంలోని తలంబూర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, 26 ఏళ్ల వెట్రిమారన్ అలియాస్ పాండి మహేశ్వరి.. 24 ఏళ్ల ఆర్ నందినిని దారుణంగా చంపేశాడు. గొలుసులతో కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. మదురైకి చెందిన ఆర్ నందిని, వెట్రిమారన్ అలియాస్ మహేశ్వరి ఇద్దరూ మదురైలో చదువుకున్నారు.  ఇద్దరూ ఫ్రెండ్స్. వెట్రిమారన్ లింగ మార్పిడి ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా ఆయనతో నందిని ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసింది. వీరిద్దరూ తొరాయిపాక్కమ్‌లోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. దీంతో వారిద్దరు ముఖాముఖిగా ఎదురుపడటం ఎక్కువైంది.

నందిని బర్త్ డే సెలెబ్రేషన్ అనే పేరు చెప్పి ఆమెను రప్పించుకున్నాడు. కళ్లు మూశాడు. ఆమెను చైన్లతో కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె చైన్‌లతోనే ఉండి కాలిపోతున్న స్థితిలో స్థానికులు ఆమెను చూశారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఆమె మరణించింది. 

Also Read : రేవంత్ ప్రభుత్వానికి ‘లీకుల’ సెగ.. వారికి మూడినట్టేనా?

మరో యువకుడిపై ఆమె ఆసక్తి చూపిస్తున్న కారణంగానే వెట్రిమారన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

తమిళ నాడు పోలీసులు వెంటనే వెట్రిమారన్‌ ను పట్టుకున్నారు. ఆయనపై హత్యానేరం కింద కేసు నమోదైంది. జ్యూడీషియల్ కస్టడీకి రిమాండ్ పంపారు. ఈ కేసు వివరాలు, ఘటనా వివరాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios