Asianet News TeluguAsianet News Telugu

CM Revanth Reddy: ప్రజాస్వామ్యం పునరుద్ధరణ.. ప్రతి శుక్రవారం ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్

ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ పార్టీ మహాత్మాజ్యోతిబా ఫూలే ప్రజా భవన్ వేదికగా ప్రజా దర్బర్ నిర్వహిస్తామని కాంగ్రెస్ సీనియర్ లీడర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
 

praja darbaar at praja bhavan, cm revanth reddy, deputy cm mallu bhatti vikramarka, ministers to attend kms
Author
First Published Dec 8, 2023, 5:38 AM IST

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజే దూకుడును ప్రదర్శించింది. సీఎం రేవంత్ రెడ్డి క్షణం తీరిక లేకుండా రోజును గడిపారు. ప్రమాణ స్వీకారం, క్యాబినెట్ భేటీ, అందులో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రజలందరికీ అర్థం కావడానికి శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి, ఏర్పడ్డాక ఇప్పటి పరిస్థితిని బేరీజు వేస్తూ ఆ శ్వేతపత్రం ఉండనుంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి శుక్రవారం ప్రజా భవన్ వేదికగా ప్రజా దర్బార్ నిర్వహించాలని నిర్ణయించింది.

శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజల నుంచి విజ్ఞప్తులు అందుకోనున్నారు. వాటిని సంబంధిత అధికారికి సూచించి సమస్యను పరిశీలించి పరిష్కరించాల్సిందిగా ఆదేశించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నదని, అందుకోసమే ఈ తీరులో ప్రజలతో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

Also Read : CM Revanth Reddy: కాంగ్రెస్‌ కరెంట్ కష్టాలు? నేడు ఉదయం ఉన్నతాధిరులతో సీఎం భేటీ

ప్రతి శుక్రవారం మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజా భవన్‌లో ఈ  ప్రజా దర్బార్ ఉండనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios