Asianet News TeluguAsianet News Telugu

పవర్ సిస్టమ్ కార్పోరేషన్ లో నిషేధం: విద్యుత్ కోనుగోలుపై తెలంగాణకు ఇబ్బందులు

కేంద్ర విద్యుత్ సంస్థకు బకాయిల చెల్లించలేదని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ నుండి విద్యుత్ కొనుగోలు విషయమై తెలంగాణకు ఇబ్బందిగా మారింది.తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలకు చెందిన డిస్కంలు విద్యుత్ కొనుగోలు చేయకుండా కేంద్రం నిషేధం  విధించింది. 
 

Power ministry pulls spot market plug from  Telangana And other 12 states, may find it hard to buy power
Author
hyde, First Published Aug 19, 2022, 10:11 AM IST


హైదరాబాద్: కేంద్ర ఎనర్జీ ఎక్చేంజీకి బకాయి చెల్లింపు విషయంలో డిఫాల్టర్ గా మారడంతో ఇండియన్  పవర్  సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ నుండి విద్యుత్ కొనుగోలు విషయమై తెలంగాణకు ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఎనర్జీ ఎక్చేంజీకి బకాయి  పడడంతో తెలంగాణ,ఏపీ సహా మరో 13 రాష్ట్రాలు కేంద్ర పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ నుండి విద్యుత్ కొనుగోలుపై నిషేధం విధించింది.ఈ నిషేధం ఈ నెల 18వ తేదీ రాత్రి నుండి అమల్లోకి వచ్చింది.గతంలో కూడా ఇదే తరహాలో పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ నుండి విద్యుత్ కొనుగోలు విషయమై పలు రాష్ట్రాలపై నిషేధం విధించినా వెంటనే తొలగించిన పరిస్థితులున్నాయి. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 1380 కోట్లను పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్  కు బకాయి పడింది.దేశంలో మొత్తం 13 రాష్ట్రాలు సుమారు రూ. 5,080 కోట్లు బకాయిలున్నాయి. ఈ బకాయిలు చెల్లించడానికి గడువు కూడా దాటిపోయింది. ఈ గడువు పూర్తైనా కూడ బకాయిలు చెల్లించని కారణంగా పవర్ సిస్టమ్ నిర్ణయం తీసుకొంది. దేశంలోని  అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ రాష్ట్రమే ఈ కార్పోరేషన్ కు ఎక్కువ నిధులు బకాయి పడింది. అన్ని రాష్ట్రాలు వెయ్యి కోట్ల లోపుగానే బకాయిలుంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం రూ., 1380 కోట్లు బకాయిలు పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ. 412 కోట్లు మాత్రమే బకాయి  చెల్లించాల్సి ఉంది. 

తెలంగాణలో విద్యుత్ ను ఉత్పత్తి చేసే జెన్ కోకు అన్ని బకాయిలను చెల్లించామని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో చైర్మెన్ ప్రభాకర్ రావు  మీడియాకు తెలిపారు.నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ విద్యుత్ సరపరాను క్రమబద్దీకరిచేందుకు ఉద్దేశించిన సంస్థ అని ప్రభాకర్ రావు చెబుతున్నారు. అయితే వాణిజ్య పరమైన అంశాలపై ఈ సంస్థ జోక్యాన్ని ప్రభాకర రావు తప్పు బడుతున్నారు. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ పాత్రను కోర్టులో సవాల్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఈ విషయమై స్టే ఆర్డర్ ఉందని ఆయన వివరించారు.

also read:తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలకు కేంద్రం షాక్: పీఓఎస్ఓసీఓ నుండి విద్యుత్ కొనుగోలుపై నిషేధం

జెన్ కో, డిస్కంల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అమలులో ఉన్నాయన్నారు. ఈ విషయంలో ఇతరుల జోక్యాన్ని ప్రభాకర్ రావు ప్రశ్నించారు.  పవర్ ఎక్చేంజ్ ల ద్వారా  ఆపరేషన్ చేయడంతో పాటు ఓపెన్ యాక్సెస్ ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా సురక్షితమైన విద్యుత్ ను ఇచ్చేందుకు రాష్ట్ర హైకోర్టు డిస్కంలను అనుమతించిందని ప్రభాకర్ రావు ప్రస్తావిస్తున్నారని  ప్రముఖ పత్రిక డెక్కన్ క్రానికల్  కథనం ప్రచురించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios