ఎస్ఆర్ గార్డెన్స్ లో అధికారుల సర్వే, మార్కింగ్: పొంగులేటి అనుచరుల ఆందోళన

మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఎస్ఆర్  గార్డెన్స్ లో అధికారులు  సర్వే నిర్వహించి మార్కింగ్  చేశారు.

Ponguleti Srinivas Reddy Followers Tries to Obstruct Survey Officials  in Khammam lns

ఖమ్మం: మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెందిన ఎస్ఆర్ గార్డెన్స్ లో  అధికారులు సోమవారంనాడు సర్వే నిర్వహించారు. ప్రభుత్వ భూమి  ఎస్ఆర్ గార్డెన్స్ ఆక్రమణలో ఉందనే అనుమానంతో సర్వే చేశారు. ఎన్‌ఎస్‌పీ భూమి ఉందని  అధికారులు  సర్వే నిర్వహించారు. కోర్టు పరిధిలో వివాదం  ఉంటే  ఎలా సర్వే చేస్తారని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  అధికారులను ప్రశ్నించారు. సర్వేను అడ్డుకొన్నారు.

దీంతో  సర్వే నిర్వహణకు  వచ్చిన అధికారులు  పోలీసుల సహాయం తీసుకున్నారు. పోలీసుల సహాయంతో ఎస్ఆర్ గార్డెన్స్ లో సర్వే నిర్వహించి  మార్కింగ్  చేశారు.  అధికారులు  ఈ గార్డెన్స్ లో సర్వే నిర్వహించే సమయంలో  అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  అనుచరులు  నినాదాలు చేశారు. పార్టీ మారిన తర్వాత  ఎస్ఆర్ గార్డెన్స్ లో  ప్రభుత్వ భూమి ఉన్న విషయం గుర్తుకు వచ్చిందా  అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు  ప్రశ్నిస్తున్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకత్వం   సస్పెన్షన్ వేటేసింది.   దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఇటీవలనే  కాంగ్రెస్ పార్టీలో చేరారు.2014 ఎన్నికల్లో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం ఎంపీ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు.  

ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్సీపీని వీడి  బీఆర్ఎస్ లో చేరారు.  బీఆర్ఎస్ నాయకత్వం తీరుపై  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.  జిల్లా వ్యాప్తంగా  ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.  ఈ సమ్మేళనాల్లో  బీఆర్ఎస్ నాయకత్వంపై  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి   విమర్శలు చేశారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  బీఆర్ఎస్ నాయకత్వం  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటేసింది. 
 

 

 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios