తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి రాజకీయంగా హైడ్రామా కొనసాగుతోంది. ఈ నెల 9న జరగబోయే ఎన్నికలను ఎట్టి పరిస్ధితుల్లోనూ అడ్డుకుని తీరుతామని జయేశ్ రంజన్ ప్యానల్ తేల్చి చెప్పింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా చంద్రకుమార్ నియామకం చెల్లదని జయేశ్ వర్గం ఆరోపిస్తోంది.

Also Read:షాక్: టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డికి షోకాజ్

మొదట మాజీ న్యాయమూర్తి కేసీ. భానును రిటర్నింగ్ అధికారిగా నియమించి.. అనంతరం మరో మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్‌ను తీసుకురావటాన్ని జయేశ్ రంజన్ వర్గం తప్పుబడుతోంది. ఢిల్లీ పెద్దల సహకారంతో కొందరు తెలంగాణ రాష్ట్రంలో పెత్తనం చేయాలని చూస్తున్నారని జయేశ్ రంజన్ వర్గం ఆరోపిస్తోంది.

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఢిల్లీలో కాదు.. హైదరాబాద్‌లోనే జరుగుతాయని తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు అన్నారు. రిటర్నింగ్ అధికారిగా జస్టిస్ చంద్రకుమార్ నియామకంపై తాము కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

Also Read:తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ట్విస్ట్: ఆ ఇద్దరి నామినేషన్లు రిజెక్ట్

జయేష్ రంజన్ నామినేషన్‌రను తిరస్కరించటం అనైతికమని, నామినేషన్ తిరస్కరణకు గల కారణాలను రిటర్నింగ్ అధికారి ఇప్పటికీ చెప్పటం లేదని, అసలు రిటర్నింగ్ అధికారిగా చంద్రకుమార్‌ను ఎవరు నియమించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:మా అమ్మను కాపాడండి కోరిన టెక్కీ: కేటీఆర్ స్పందన ఇదీ

కాగా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. అధ్యక్ష పదవికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి బరిలో నిలిచారు. అధ్యక్ష పదవికి ముగ్గురు నామినేషన్లు వేయగా.. జయేశ్, జితేందర్ నామినేషన్లు తిరస్కరించబడ్డాయి.