Asianet News TeluguAsianet News Telugu

షాక్: టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డికి షోకాజ్

టీఎంయూ నేత ఆశ్వత్థామ రెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం ఆదివారం నాడు షోకాజ్ నోటీసు ఇచ్చారు. 

Rtc management issues show cause notice to Ashwathama reddy
Author
Hyderabad, First Published Feb 2, 2020, 4:01 PM IST

హైదరాబాద్: టీఎంయూ నేత ఆశ్వత్హామరెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం  ఆదివారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లాంగ్‌లీవ్‌లో ఉన్న ఆశ్వత్థామరెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకొంది.

గత ఏడాది ఆర్టీసీ సమ్మెలో టీఎంయూ ప్రధాన భూమిక పోషించింది. ఆర్టీసీ సమ్మె విరమణ తర్వాత ఆశ్వత్థామరెడ్డి సెలవులో ఉన్నాడు. లాంగ్ లీవ్‌ను మరోసారి ఆయన పొడిగించుకొన్నాడు.అయితే  ఆశ్వత్థామరెడ్డి లాంగ్‌లీవ్ లో ఉన్న సమయంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఆర్టీసీ సమ్మె తర్వాత యూనియన్ నేతలకు ఉన్న  సౌకర్యాలను ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. యూనియన్ నేతలకు ఉన్న లీవ్ రిలీఫ్ ను అధికారులు రద్దు చేశారు. టీఎంయూ కార్యాలయాన్ని కూడ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. గత ఏడాది డిసెంబర్ 6వ తేదీ నుండి ఈ ఏడాది మే 5వ తేదీ వరకు సెలవు కావాలని  ఆశ్వత్థామ రెడ్డి  ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు. 

 లీవ్ విత్ పేమెంట్ ఇవ్వాల‌ని ఆశ్వత్థామరెడ్డి ధర‌ఖాస్తు పెట్టుకున్నారు. కానీ, ఆర్టీసీ ఆర్థిక ప‌రిస్థితి బాగోలేనందున కుద‌ర‌ద‌ని యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో మ‌ళ్లీ ఆయ‌న ఎక్స్‌ట్రార్డిన‌రీ లీవ్‌కు ద‌ర‌ఖాస్తు చేస్తుకున్నారు. వేత‌నం లేకుండా ఐదేళ్ల పాటు ఈ లీవ్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

కానీ, ఆర్టీసీ ఇందుకు కూడా అంగీక‌రించలేదు. ఆర్టీసీ స‌మ్మె కార‌ణంగా చాలా మంది ప్ర‌యాణికులు ఆర్టీసీకి దూరమయ్యారని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడింది. దీంతో ప్రతి ఒక్కరూ కూడ విధుల్లో చేరాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. 

లీవ్  ఇవ్వడం కుదరదని యాజమాన్యం చెప్పింది. ప్రభుత్వం కక్షసాధింపుకు దిగిందని ఆశ్వత్థామరెడ్డి అప్పట్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  అప్పటి నుండి ఆశ్వత్థామ రెడ్డి విధులకు హాజరు కావడం లేదు.ఈ కారణంగానే ఆశ్వత్థామరెడ్డికి నోటీసులు జారీ చేసినట్టుగా చెబుతున్నారు. 

గత ఏడాది నవంరబ్ 29వ తేదీన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకొంది. సమ్మె చేస్తున్న కార్మికులు భేషరతుగా విధుల్లో చేరాలని ప్రభుత్వం చెప్పింది. సుమారు 55 రోజుల తర్వాత ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాధన కోసం ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, టీఎన్‌జీవోలు సుమారు 42 రోజుల పాటు సకల జనుల సమ్మె నిర్వహించారు.  తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ రోజులు జరిగిన సమ్మెగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రికార్డులకు ఎక్కింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios