సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదం: కాచీబౌలి కాలనీవాసుల తరలింపు

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట  డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో  జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పక్కనే ఉన్న కాచీబౌలీ  కాలనీని  పోలీసులు ఖాళీ చేయించారు.

Police Tries To evacuate kachibowli colony people due to fire accident

హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని  డెక్కన్ నైట్ వేర్ స్టోర్  దుకాణంలో  అగ్ని ప్రమాదం కారణంగా  పక్కనే ఉన్న కాచీబౌలి కాలనీని పోలీసులు ఖాళీ చేయించారు.. మంటలను  ఈ కాలనీకి వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  ఒకవేళ  మంటలు వ్యాపించినా పెద్ద ఎత్తున ప్రమాదం జరగకుండా  ఉండేందుకు గాను  ఈ కాలనీలో  గ్యాస్ సిలిండర్లను పోలీసులు  దూరంగా తరలిస్తున్నారు.   ఈ భవనంలో  సింథటిక్,  రెక్సిన్  వంటి  పదార్ధాలు  ఉండడంతో  మంటలు మళ్లీ వ్యాపించాయి.   కింది  ఫ్లోర్ నుండి   మంటలు  భవనం మొత్తం వ్యాపిస్తున్నాయి.  

మంటల ధాటికి  అద్దాలు పగిలిపోతున్నాయి. అంతేకాదు  మంటలధాటికి  భవనంలో  శబ్దాలు విన్పిస్తున్నాయి.  ఈ భవనంలో  ఎనిమిది సిలిండర్లు  ఉన్నాయని  ఈ భవనం నుండి బయటపడిన సిబ్బంది సమాచారం ఇచ్చారు. అయితే ఈ సిలిండర్లను  బయటకు తెచ్చేందుకు  రెస్క్యూ సిబ్బంది ప్రయత్నించారు. మంటల ధాటికి  సిలిండర్లు  పేలిపోయే అవకాశం ఉన్నందున  అధికారులు  జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  మంటల ధాటికి భవనం కూడా  దెబ్బతిని కూలిపోయే అవకాశం ఉన్నందున  భవనం  చుట్టుూ ఎవరూ లేకుండా  ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ భవనంలో మంటలను ఆర్పేందుకు  10 ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి.  డెక్కన్  నైట్ వేర్ దుకాణంలోని ఐదు అంతస్థుల్లో  మంటలు వ్యాపించాయి.  గాలి తీవ్రత కారణంగా  పక్క భవనానికి కూడా మంటలు అంటుకున్నాయి,. ఈ ప్రమాదాన్ని గుర్తించిన  అధికారులు  ముందే ఈ భవనంలోని వారిని ఖాళీ చేయించారు.

also read:సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలో అగ్నిప్రమాదం: రెస్క్యూకు వెళ్లిన ముగ్గురికి అస్వస్థత

మంటల తీవ్రతకు  ఫైర్ ఫైటర్లు  కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  మటలు తీవ్రతతో వేడి  బయటకు వస్తోంది.  ఈ భవనం వెనుక వైపు నుండి  మంటలను ఆర్పే ప్రయత్నాలను అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు.  భవనం ముందు వైపు నుండి  మంటలను ఆర్పేందుకు  చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు.  ఈ భవనంలో  మంటలు అదుపులోకి రావడానికి ఇంకా  సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు  అంచనా వేస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios