సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలో అగ్నిప్రమాదం: రెస్క్యూకు వెళ్లిన ముగ్గురికి అస్వస్థత
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదంలో రెస్క్యూకు ప్రయత్నించిన కానిస్టేబుల్ అస్వస్థతకు గురయ్యారు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్:సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట అగ్ని ప్రమాదంలో రెస్క్కూ కు ప్రయత్నించిన ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన వారిలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందితో పాటు కానిస్టటేబుల్ అస్వస్థతకు గురయ్యాడు. . ఇవాళ ఉదయం నుండి రామ్ గోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోని అంతస్థుల్లోకి మంటలు వ్యాపించాయి.మంటల ధాటికి భవనం మొత్తం పొగ వ్యాపించింది. సుమారు కిలోమీటరు దూరం వరకు ఈ పొగ వ్యాపించింది. ఈ భవనం పై అంతస్థులో ఉన్న నలుగురిని క్రేన్ సహాయంతో ఫైర్ ఫైటర్లు రక్షించారు. ఈ భవనంలో ఎవరైనా ఉన్నారా అనే విషయమై చూసేందుకు భవనంలోకి వెళ్లిన కానిస్టేబుల్ పొగకు ఊపిరాడకపోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. అతడిని అక్కడే ఉన్న అంబులెన్స్ కు తరలించారు. అంబులెన్స్ లో ఉన్న సిబ్బంది కానిస్టేబుల్ కు వైద్య చికిత్స అందించారు.
also read:సికింద్రాబాద్ రాం గోపాల్ పేటలో అగ్ని ప్రమాదం: సహాయక చర్యలను పరిశీలించిన తలసాని
ఇవాళ ఉదయం నుండి మంటలను ఆర్పేందుకు షైర్ ఫైటర్లు ప్రయత్నిస్తున్నాయి. ఈ భవనంలో ఉన్న సింథటిక్ మెటీరియల్ కారణంగా మంటలు మరోసారి వ్యాప్తిం చెందాయి. ఈ మంటలు ఇతర ఫ్లోర్లలోకి కూడా వ్యాపిస్తున్నాయి. రసాయనాలు ఉపయోగించి మంటలను ఆర్పే ప్రయత్నిస్తున్నాయి. భవనం చుట్టూ ఆరు ఫైరింజన్లు మంటలను ఆర్పివేస్తున్నాయి. ఈ భవనం చుట్టూ ఉన్న భవనాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. అన్ని శాఖల కు చెందిన అధికారులు సమన్వయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భవనం నుండి పక్కనే భవనాలకు మంటలు వ్యాపించకుండా ఉండేందుకు గాను చర్యలు తీసుకుంటున్నారు.
అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది
ఇదిలా ఉంటే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు అగ్ని మాపక సిబ్బంది కూడా అస్వస్థతకు గురయ్యారు. పొగ కారణంగా శ్వాస సంబంధమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో ఈ ఇద్దరు అగ్నిమాపక సిబ్బందిని అధికారులు ఆసుపత్రికి తరలించారు.