Asianet News TeluguAsianet News Telugu

మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు... ‘‘ఆమె’’ కోసం పోలీసుల గాలింపు, నైజీరియన్ల పాత్రపై అనుమానం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పోలీసులు ఓ మహిళ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సిద్ధి అంబర్ బజార్‌లో 11న శాన్విక్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో బ్యాంక్ ఖాతా తెరిచింది షాజహాన్. ముంబైకి చెందిన షాజహాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

police speed up investigation on mahesh bank server hack case
Author
Hyderabad, First Published Jan 27, 2022, 7:23 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పోలీసులు ఓ మహిళ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సిద్ధి అంబర్ బజార్‌లో 11న శాన్విక్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో బ్యాంక్ ఖాతా తెరిచింది షాజహాన్. ముంబైకి చెందిన షాజహాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిధులు గోల్‌మాల్ జరిగిన రోజునే షాజహాన్‌కు బ్యాంక్ సిబ్బంది ఫోన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. బ్యాంక్ సిబ్బంది ఫోన్ చేయడంతో షాజహాన్ పరార్ అయ్యింది. 

షాజహాన్ అకౌంట్ ద్వారా రూ.6.9 కోట్లు బదిలీ చేశారు నేరగాళ్లు. మహేశ్ బ్యాంక్ ప్రధాన సర్వర్ నుంచి షాజహాన్ అకౌంట్‌కి నిధులు బదిలీ చేసినట్లుగా తేల్చారు. షాజహాన్ ఫోన్ ఐడీలు, మెయిల్ అడ్రస్‌లను హ్యాకర్స్ మార్చలేదు. షాజహాన్‌కు హ్యాకర్స్‌తో సంబంధాలున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన సర్వర్‌పై రష్యా, చైనా నుంచి ఆపరేట్ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండియాలో హాకర్స్‌కి నైజీరియన్లు సపోర్ట్ చేసినట్లుగా భావిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ మహేష్ బ్యాక్ కో ఆపరేటివ్‌ బ్యాంక్ (Andhra Pradesh Mahesh Cooperative Bank) ప్రధాన సర్వర్‌ను హ్యాక్‌ చేసిన సైబర్ నేరగాళ్లు రూ. 12.9 కోట్లు కొల్లగొట్టారు. ఈ కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత బ్యాంక్‌లోని మూడు అంకౌంట్లకు డబ్బులు తరలించిన నేరగాళ్లు.. దానిని ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 128 ఖాతాలకు బదిలీ చేశారు. ఈ క్రమంలోనే ఆ మూడు బ్యాంకకు ఖాతాల యజమానుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆ మూడు అకౌంట్‌ల విషయానికి వస్తే అవి.. శాన్విక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, హిందుస్తాన్‌ ట్రేడర్స్‌, షానవాజ్‌ బేగం పేర్లతో ఉన్నాయి. ఈ ఖాతాలను వివిధ బ్రాంచ్‌లో తెరిచారు. 

అయితే ఇందుకు సంబంధించి హుస్సేనిఆలంకు చెందిన వినోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూస్తాన్ ట్రేడర్స్ పేరుతో మహేష్ బ్యాంకులో వినోద్ అకౌంట్ తెరిచారు. ఈ బ్యాంక్‌ అకౌంట్ ద్వారానే వివిధ ఖాతాల్లోకి డబ్బులు మళ్లించారు. ఇక, నేరానికి పాల్పడిన అనంతరం బ్యాంకు సర్వర్‌లో ఆధారాలను కేటుగాళ్లు తొలగించారు. బ్యాంక్ సర్వర్లను 18 గంటల పాటు వారి ఆధీనంలో ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది. 

మహేష్ బ్యాంక్ సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ సంస్థ నిర్వహిస్తుండగా.. సాఫ్ట్‌వేర్‌ను ముంబైకి చెందిన సంస్థ అందించింది. ప్రాక్సీ సర్వర్‌తో సైబర్ నేరగాళ్లు సర్వర్‌ను యాక్సెస్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నేరం చేయడానికి ముందు సైబర్ నేరగాళ్లు.. చెస్ట్ ఖాతాను యాక్సిస్ చేసి ఈ మూడు ఖాతాల లావాదేవీల పరిమితిని రూ. 50 కోట్లకు పెంచేశారు. సైబర్ నేరగాళ్లు.. డైరెక్ట్‌గా సర్వర్‌ను హ్యాక్ చేశారా..? లేదా బ్యాంక్ సాఫ్ట్‌వేర్ లోకి ప్రవేశించి సర్వర్‌ను హ్యాక్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఐపీ ఆడ్రస్ ప్రకారం అమెరికా, కెనడా నుంచి ఈ ఆపరేషన్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios