నాన్న టచ్ లో లేరు, పశ్చాత్తాపంతోనే కావచ్చు: మారుతీరావు కూతురు అమృత

తన భర్త హత్య కేసు నిందితుడైన తండ్రి మారుతీ రావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత వర్షిణి స్పందించారు. తన భర్తను చంపిన పశ్చాత్తాపంతోనే మారుతీ రావు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని ఆమె అన్నారు.

Amrutha varshini reaction on maruthi Rao's suicide

హైదరాబాద్: తన భర్త ప్రణయ్ హత్య జరిగిన నాటి నుంచి తన తండ్రి తనతో టచ్ లో లేరని మారుతీరావు కూతురు అమృత వర్షిణి అన్నారు. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీ రావు ఆదివారం హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

ఆయన ఆత్మహత్యపై అమృత వర్షిణి స్పందించారు. ప్రణయ్ ను చంపినందుకు పశ్చాత్తాపంతోనే అమృత రావు ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఆమె అన్నారు. మారుతీరావు మృతిపై టీవీ చానెళ్లలో చూసి తెలుసుకున్నట్లు ఆమె తెలిపారు. 

Also Read: ప్రణయ్ హత్య కేసు నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య

మారుతీరావు వాహనం డ్రైవర్ ను పోలీసులు విచారించారు. మారుతీ రావు గత కొంత కాలంగా మథనపడుతున్నారని, కేసు నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆవేదన చెందుతుండేవాడని అతను చెప్పినట్లు తెలుస్తోంది.

అమృత కులాంతర వివాహం చేసుకుందనే ఆగ్రహంతో ఆమె భర్త ప్రణయ్ ను మారుతీ రావు కిరాయి హంతకులతో హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పీడీ యాక్ట్ కింద అరెస్టయిన మారుతీ రావు ఆరు నెలల క్రితం బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు. 

Also Read: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు: మారుతీరావు షెడ్డులో మృతదేహం

బెయిల్ మీద విడుదలైన తర్వాత కూతురితో రాయబారాలకు ఇద్దరు వ్యక్తులను పంపినట్లు తెలుస్తోంది. ఆస్తి మొత్తం రాసిస్తానని ఆయన రాయబారులతో ఆమెకు చెప్పించినట్లు తెలుస్తోంది. అందుకు అమృత నిరాకరించారు. కూతురిని తనకు అనుకూలంగా మార్చుకుని కేసు లేకుండా చేసుకోవాలని మారుతీరావు ప్రయత్నించారు. 

అయితే, తనను బెదిరిస్తున్నారంటూ అమృత ఫిర్యాదు చేయడంతో మారుతీరావుపై మరికొంత మందిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో గత వారం మారుతీరావు షెడ్ లో గుర్తు తెలియని శవం లభించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios